విశ్వక్ సేన్ హీరోగా దిల్ రాజు సమర్పణలో వచ్చిన పాగల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.సినిమా ఏమాత్రం బాగాలేదు అని.
పాగల్ పిచ్చెక్కించాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో పాగల్ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఒకటి సోషల్ మీడియాలో మరింతగా చర్చనీయాంశం అవుతోంది.
పాగల్ సినిమా ను జనాలు ఆధరిస్తున్నారు.అందుకు ఈ సినిమా యూనిట్ సభ్యుల తరపున కృతజ్ఞతలు చెప్పేందుకు గాను థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.
వైజాగ్ లో ఈ కార్యక్రమంను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

పాగల్ సినిమా ప్రమోషన్ విషయంలో విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి చర్చనీయాంశం అవుతున్నాయి.ఒట్టేసి చెబుతున్నా పాగల్ సినిమాను ఖచ్చితంగా జనాలు ఆధరిస్తారు.తప్పకుండా సినిమా ఘన విజయంను సొంతం చేసుకుంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
మూసి ఉన్న థియేటర్లను తెరిపిస్తాను అంటూ ధీమాగా చెప్పడంతో పాటు బన్నీకి ఆర్య ఎలాగో విశ్వక్ సేన్ కు పాగల్ అలా అంటూ కొందరు కామెంట్స్ చేశారు.అంతగా కామెంట్స్ చేసిన సినిమా బాక్సాపీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన విశ్వక్ సేన్ పాగల్ సినిమాను బాక్సాఫీస్ వద్ద బోక్క బోర్ల పడేశారు అభిమానులు మరియు ప్రేక్షకులు.అయినా కూడా విశ్వక్ సేన్ మాత్రం వైజాగ్ లో సక్సెస్ మీట్ పెట్టడంను కొందరు కామెడీగా తీసుకుంటున్నారు.
ఈమద్య కాలంలో సినిమాలు నిరాశ పర్చినా కూడా పబ్లిసిటీ కోసం సక్సెస్ మీట్ లు ఏర్పాటు చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల సినిమాకు అదనపు ఖర్చు మినహా పెద్దగా ఉపయోగం లేదు అనేది కొందరి వాదన.
కాని ఈ పబ్లిసిటీ వల్ల రెండు మూడు రోజులు అయినా సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతాయి అనేది కొందరి అభిప్రాయం.