హిట్ మూవీతో హిట్ అందుకుని సక్సెస్ బాటలో అడుగులు వేస్తున్న యువ హీరో విశ్వక్ సేన్ మరో మూవీతో మన ముందుకు రాబోతున్నాడు.విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నేడు అధికారికంగా ప్రారంభించారు.
బెక్కెం వేణుగోపాల్ ప్రొడ్యూసర్‌గా చేస్తున్న ఈ సినిమా లాంఛ్ గురువారం రామానాయుడు స్టూడియోలో జరిగింది.
పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు రానా మొదటి క్లాప్ కొట్టాడు.
ఫస్ట్ షాట్‌ను నక్కిన త్రినాథ రావు డైరెక్ట్ చేయగా జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ఈ సినిమాతో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
ఇక ఈ సినిమా ఒక పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమాకు పాగల్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
కాగా ఈ సినిమాతో తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు విశ్వక్.మరి పాగల్ సినిమా ప్రేక్షకులను పాగల్ చేస్తుందా లేక ఫ్లాప్‌గా నిలిచి హీరోనే పాగల్ చేస్తుందా అనేది సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి.