నెక్ట్స్ మూవీని అప్పుడే లాంఛ్ చేస్తానంటోన్న విశ్వక్

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటటించిన రీసెంట్ మూవీ ‘హిట్’ బాక్సాఫీస్ వద్ద నిజంగానే హిట్ మూవీగా నిలిచింది.నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో విశ్వక్ సేన్ యాక్టింగ్‌కు జనాలు ఫిదా అయ్యారు.

 Vishwak Sen Next Movie Launch Date Fixed-TeluguStop.com

ఇక ఈ సినిమా ఇచ్చిన హిట్‌తో విశ్వక్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు.

ఇదే జోష్‌లో తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేయడానికి విశ్వక్ సిద్ధమవుతున్నాడు.

నరేష్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో విశ్వక్ తన నెక్ట్స్ మూవీని రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ ప్రొడ్యూస్ చేయనున్నాడు.ఇక ఈ సినిమాను మార్చి 16న పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్, వైజాగ్‌లో జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర, హీరోయిన్ ఎవరనే అంశాలను చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి హిట్ చిత్రంతో విశ్వక్ సేన్ సక్సె్స్ ట్రాక్ ఎక్కాడు.

మరి తన నెక్ట్స్ సినిమా ఎలాంటి కథతో వస్తుందో విశ్వక్ త్వరలో తెలపనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube