మంచులక్ష్మి పై విశ్వక్ సేన్ హాట్ కామెంట్.. తిరిగి వెళ్ళలేవు అంటూ?

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి మనకు తెలిసిందే.నటిగా, నిర్మాతగా పలు కార్యక్రమాలను చేసిన మంచు లక్ష్మి తాజాగా ఆహా వేదికగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 Vishwak Sen Invites Manchu Lakshmi For Dinner-TeluguStop.com

ఇప్పటికే ఆహా వేదికపై ఎన్నో టాక్ షో లు వచ్చాయి.సమంత ,దగ్గుబాటి రానా వంటివారు టాక్ షోల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఆహా కేవలం టాక్ షో లను మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లను, సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే మంచు లక్ష్మి “ఆహా భోజనంబు”అనే వంటల కార్యక్రమం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Vishwak Sen Invites Manchu Lakshmi For Dinner-మంచులక్ష్మి పై విశ్వక్ సేన్ హాట్ కామెంట్.. తిరిగి వెళ్ళలేవు అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

“ఆహా భోజనంబు” అనే పేరు వినగానే అర్థం అవుతుంది ఇది వంటల ప్రోగ్రామ్ అని.ఈ క్రమంలోనే మంచు లక్ష్మి తన మొదటి ఎపిసోడ్ లో భాగంగా నటుడు విశ్వక్ సేన్ ను తన ఆహా భోజనంబు కార్యక్రమానికి ఆహ్వానించారు.ఈ క్రమంలోనే మంచు లక్ష్మి, విశ్వక్ సరదాగా ఈ కార్యక్రమంలో గడిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వక్ వెజ్ రెసిపీ వండారు.ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ సాధారణంగా మా ఇంట్లో కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే వేజ్ వండుతారు.మిగతా రోజులన్నీ చికెన్, మటన్, ఫిష్ వంటి నాన్ వెజ్ మాత్రమే ఉంటాయి.

నాకు నాన్ వెజ్ తినడం అంటే చాలా ఇష్టం అంటూ లక్ష్మీప్రసన్నతో ముచ్చటించారు.

ప్రతి రోజు మా ఇంట్లో భోజనంలో భాగంగా పాయ తప్పనిసరిగా ఉండాలి.

అది చికెన్ పాయ మటన్ పాయ వంటి కాంబినేషన్లతో తయారు చేసుకుంటాము.అదేవిధంగా విశ్వక్ తన తల్లి గురించి మాట్లాడుతూ.

మా అమ్మ ప్రతి రోజు మా ఇంట్లో సుమారు 20 నుంచి 25 మంది వరకు అన్నదానం చేస్తుంటారనీ విశ్వక్ తెలిపారు.షో లో అయితే వెజ్ వండాను కానీ మీరు ఒకసారి మా ఇంటికి రండి మీకు ఏడూ ఎనిమిది రకాల నాన్ వెజ్ రెసిపీ వండి పెడతాము.

కేవలం మీ ఇంటి నుంచి రెండు లైన్లు వెనక్కివస్తే మాఇల్లు వస్తుంది అంటూ తన ఇంటికి ఆహ్వానించాడు.

Telugu Dinner, Lakshmi Manchu, Pagal Movie, Vishwak Sen-Movie

ఈ క్రమంలోనే మంచు లక్ష్మి స్పందిస్తూ.అయితే మీ ఇంటికి సైకిల్ పై వస్తాను.వచ్చేటప్పుడు కాస్త ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుందంటూ మంచు లక్ష్మి కౌంటర్ చేశారు.

ఈ క్రమంలోనే విశ్వక్ మాట్లాడుతూ మా ఇంటికి వస్తే.తిరిగివెళ్ళేది ఉండదూ.

తినడంతో అక్కడే ఉండిపోవలసివస్తుందంటూ మంచు లక్ష్మిపై హాట్ కామెంట్స్ చేశారు.మొత్తానికి వీరిద్దరూ కలిసి చేసిన ఫస్ట్ ఎపిసోడ్ ఎంతో సరదాగా సాగిపోయిందని చెప్పవచ్చు.

#Vishwak Sen #Lakshmi Manchu #Dinner

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు