బిగ్ బాస్ హౌస్ లో విశ్వక్ సేన్.. మరీ చనువు తీసేసుకున్న అరియానా?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.అయితే ఈ షో చూస్తుండగానే ముగింపు దశకు చేరుకుంది.

 Vishwak Sen In Bigg Boss Hous  Ariyana Get Close To Him Bigg Boss Non Stop, Vish-TeluguStop.com

ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి కుటుంబ సభ్యులు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంట్రీ సందడి సందడి చేశారు.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ మాస్ హీరో అయిన విశ్వక్ సేన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

హీరో విశ్వక్ సేన్ తో పాటుగా మరొక ఇద్దరు హీరోయిన్లు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లతో సరదాగా గడిపాడు.

అప్పుడు విశ్వక్ సేన్ సరదాగా కొన్ని ప్రశ్నలు కూడా వేశారు.

భార్య లేదా భర్తలు వేరే వారిని లైక్ చేస్తున్నారు అన్న అనుమానం వస్తే ఏం చేస్తారు హీరోయిన్ అడగగా.

ఆ ప్రశ్న పై స్పందించిన అరియానా చీపురు ఇరగదీసి కొడతాను అంటూ బదులిచ్చింది.అనంతరం శివ బ్రాంది తాగుతాడా, విస్కీ తాగుతాడా అంటూ విశ్వ‌క్ సేన్ ప్ర‌శ్నించాడు.

అయితే తాజాగా విడుదలైన ఈ ప్రోమోని బట్టి చూస్తే ఎపిసోడ్ చాలా సరదా సరదాగా ఉన్నట్లు తెలుస్తోంది.హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Telugu Ariyana, Bigg Boss, Nagarjuna, Shiva, Tollywood, Vishwak Sen-Movie

ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ ను ఎంజాయ్ చేస్తున్నారు చిత్రబృందం.ఈ సక్సెస్ మీట్ లో భాగంగానే తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు విశ్వక్ సేన్.ఈ సినిమాకు విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.సినిమాకు ముందే బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుంది.

అయితే థియేటర్స్‌లో ఉండగానే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై ఇప్పటికే పలు వార్తలు దర్శనమిస్తున్నాయి.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా పలానా తేదీన విడుదలవుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై స్పందించిన విశ్వక్ సేన్ ఓ టి టి రిలీజ్ డేట్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తనకు కూడా ఆ రిలీజ్ డేట్ తెలియదని ఫిక్స్ అయిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube