ఒక్క సినిమాతో భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన విశ్వక్ సేన్.. ఇప్పుడు ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విశ్వక్‌ సేన్‌ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం.

 Vishwak Sen Gives Shocker His Produers He Doubles Remuneration, Viswak Sen, Remuneration, Tollywood, Double Remuneration, Ashokavanamlo Arjuna Kalyanam-TeluguStop.com

ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.హీరో విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే విశ్వక్ సేన్ ఇదివరకు సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఈ సినిమా ప్రమోషన్స్ లో వచ్చింది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో విశ్వక్‌ సేన్‌ చేసిన ఫ్రాంక్ వీడియోతో తెగ పాపులర్ అయ్యాడు.

 Vishwak Sen Gives Shocker His Produers He Doubles Remuneration, Viswak Sen, Remuneration, Tollywood, Double Remuneration, Ashokavanamlo Arjuna Kalyanam-ఒక్క సినిమాతో భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన విశ్వక్ సేన్.. ఇప్పుడు ఎంతంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా దాదాపుగా ఒక వారం రోజులపాటు ఎక్కడ చూసినా కూడా హీరో విశ్వక్‌ సేన్‌ పేరు మారుమోగిపోయింది.

ఇకపోతే విశ్వక్‌ సేన్‌ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు విద్యాసాగర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు విడుదలకు ముందే బాగా హైప్ క్రియేట్ అయింది.మే 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో విశ్వక్‌ సేన్‌ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే హీరో విశ్వక్‌ సేన్‌ రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా నటించిన అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమాకు ముందు వరకు 1.5-2కోట్ల వరకు పారితోషికం తీసుకున్న విశ్వక్‌ సేన్‌ ఇప్పుడు ఆ రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేశాడట.కొత్త ప్రాజెక్ట్స్‌ కోసం విశ్వక్‌ దగ్గరికి వెళ్తే తన రెమ్యునరేషన్‌ ఇప్పుడు 3కోట్లు అని చెప్పి నిర్మాతలకు షాక్‌ ఇస్తున్నాడట.అడిగినంత ఇస్తేనే సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.

మరి ఈ విషయంలో నిజానిజాలు తెలియాలి అంటే అధికారికంగా విశ్వక్ సేన్ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube