పాగల్ పై క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ హీరోగా పాగల్ సినిమా తెరకెక్కి రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో పాటు సాంగ్స్ కూడా భాగా ఆకట్టుకున్నాయి.

 Vishwak Sen Gives Clarity On Pagal Ott Release, Dil Raju, Tollywood, Telugu Cine-TeluguStop.com

ఈ సినిమాలో ప్రియురాలిని అమితంగా ప్రేమించే యువకుడుగా విశ్వక్ సేన్ కనిపించబోతున్నాడు.ఆమె కోసం ప్రాణాలు తీసుకోవడానికి అయిన రెడీ అయ్యే మొండివాడిగా అతని పాత్ర ఉంది.

ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ తెలుగు ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అవుతాయనే విషయం ఇడియట్ మూవీ ప్రూవ్ చేసింది.ఇప్పుడు అలాంటి కథాంశంతోనే పాగల్ సినిమా కూడా తెరకెక్కింది.

నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే.నివేథా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్స్ గా నటించారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిపోయింది.అయితే ప్రస్తుతం చిన్న సినిమాలు అన్ని కూడా చాలా వరకు ఒటీటీ బాట పడుతున్నాయి.

థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ లేకపోవడంతో అందుబాటులో ఉన్న డిజిటల్ ఛానల్స్ నుంచి వస్తున్నా ఆఫర్స్ తీసుకొని ఒటీటీ రిలీజ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.గతంలో దిల్ రాజు వి మూవీని ఒటీటీలో రిలీజ్ చేసి సేఫ్ అయ్యారు.

ఇప్పుడు పాగల్ మూవీని కూడా ఒటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ నడిచింది.దీనిపై హీరో విశ్వక్ సేన్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పటికే ఈ మూవీ థీయాట్రికల్ బిజినెస్ మొత్తం జరిగిపోయిందని చెప్పాడు.ఈ నేపధ్యంలో సినిమా ఒటీటీలో రిలీజ్ చేసే అవకాశమే లేదని, థియేటర్ లో పాగల్ ని చూసి ఆశ్వాదించడానికి సిద్ధంగా ఉండాలని క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube