ఆ సీక్వెల్ తప్ప మరేది లేదంటున్న దాస్

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల నటించిన హిట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సీక్వెల్‌ను త్వరలోనే తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

 Vishwak Sen Denies Rumours, Vishwak Sen, Falaknuma Das, Hit Movie, Sequel, Paaga-TeluguStop.com

కాగా ఈ సినిమా కాకుండా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా పాగల్ అనే సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం ఆలస్యమయ్యింది.

కాగా ఈ సినిమాతో పాటు మరో తమిళ రీమేక్ చిత్రంలో విశ్వక్ సేన్ నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు చిత్ర వర్గాల్లో వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాను ప్రస్తుతం హిట్ సీక్వెల్ కోసం మాత్రమే చూస్తున్నట్లు విశ్వక్ సేన్ తెలిపాడు.ఇక గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన హిట్ చిత్ర సీక్వెల్ కూడా అంతేస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.

ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.అటు లాక్‌డౌన్ పూర్తవ్వగానే పాగల్ సినిమా షూటింగ్‌ను కూడా మొదలుపెట్టేందుకు ఈ యంగ్ హీరో రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది మరి హిట్ సీక్వెల్ చిత్రం ఈ ఏడాదిలో రిలీజ్ చేస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి అనుమానంగానే ఉందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కాగా గతంలో విశ్వక్ సేన్ నటించిన ఫలక్‌నుమా దాస్ చిత్రం కూడా ఈ హీరోకు మంచి పేరును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube