మొత్తానికి హిట్ తో హిట్ కొట్టిన ఫలక్ నుమా దాస్....

ఫలక్ నుమా దాస్ చిత్రంతో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు విశ్వక్ సేన్.అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఈ నగరానికి ఏమైంది చిత్రంతో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నా డు.

 Vishwak Sen Beat The Hit With Hit Movie-TeluguStop.com

కాకపోతే కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ లేకపోవడంతో సరైన హిట్ కోసం గత కొద్ది కాలంగా పరితపిస్తున్నాడు.అయితే తాజాగా విశ్వక్ సేన్ “హిట్” అనే చిత్రంలో నటించాడు.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నిర్మించాడు.

అలాగే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన రుహాణి శర్మ నటించగా సీనియర్ నటుడు భానుచందర్, బ్రహ్మాజీ, హరితేజ, మురళి శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చినటువంటి ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులు బాగానే ఆకట్టుకుంటోంది.అయితే కలెక్షన్ల పరంగా కూడా బాగానే వసూలు సాధిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగేటువంటి ఈ చిత్రంలో విశ్వక్ సేన్ తన నటనతో సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.అంతే గాక మిగిలిన నటీనటులు కూడా తమ వంతు న్యాయం చేస్తూ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చా రు.దీంతో విశ్వక్ సేన్ హిట్ చిత్రంతో దాదాపుగా హిట్ కొట్టినట్లే నని తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత వారం విడుదలైనటువంటి భీష్మ చిత్రం ప్రస్తుతం హిట్ చిత్రానికి థియేటర్లలో గట్టిపోటీని ఇస్తున్నట్లు తెలుస్తోంది.వారాంతానికి ఇంకా రెండు రోజులు ఉండటంతో ఈ రెండు చిత్రాల మధ్య పశువుల పోటీ మరింత పెరిగింది.మరి నితిన్ దూకుడుకి విశ్వక్సేన్ కళ్లెం వేస్తాడో లేదో చూడాలి.

 

#Vishwak HIT #HIT #Tollywaod HIT #HIT #Vishwak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు