మా తమ్ముడు చనిపోయాడంటూ కన్నీళ్లు పెట్టిన విశ్వ.. పబ్లిసిటీ స్టంట్ అంటూ నెటిజన్స్ ట్రోల్?

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హవా నడుస్తుంది.రాత్రి 10 కాగానే ప్రేక్షకులందరూ టీవీల ముందు వాలిపోతున్నారు.

 Vishwa Tears Over The Death Of Her Brother In Bigg Boss Show, Vishwa, Bigg Boss-TeluguStop.com

కంటెస్టెంట్ ల మధ్య ఏం జరుగుతుందని చూడటానికి తెగ ఆరాటపడుతున్నారు.ఇప్పటికే రెండు రోజులు పూర్తవగా మూడో రోజు కూడా బాగా ఆసక్తిగా మారింది.

ప్రోమోలో చూపించినదంత ఎపిసోడ్ లో లేదనే చెప్పాలి.ఇక కాస్త ఎమోషనల్ సీన్స్ బాగా ఎక్కువగా కనిపించాయి.

ఇదిలా ఉంటే విశ్వ కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు.

బుల్లితెర నటుడు విశ్వ గురించి అందరికీ తెలిసిందే.

పలు సీరియల్స్ లో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈ సీజన్ లో పాల్గొని తనేంటో నిరూపించుకుంటున్నాడు.

ఇక పవర్ రూమ్ టాస్క్ లో భాగంగా విశ్వ గెలిచాడు.ఇక తను మరో ఇద్దరికి టాస్క్ ఇవ్వాల్సి రాగా అందులో ప్రియ, రవికి టాస్క్ ఇచ్చాడు.

రవితో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్ లతో కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టాడు.

Telugu Acnhor Ravi, Bigg Boss, Brothr, Task, Publicity Stunt, Troll Public, Vish

ఇక రవి తనను అన్నా అంటూ అలా పిలిచేసరికి బాగా ఎమోషనల్ అయ్యాడు విశ్వ.రవి అలా పిలిచేసరికి వెంటనే హత్తుకున్నాను అని తెలిపాడు.తన సోదరుడు కూడా అలాగే పిలిచేవాడని.

రవి అన్న అనడంతో తన సోదరుని గుర్తుకు చేసుకున్నాడు విశ్వ.రవి వెంటనే ఓదార్చగా తన తమ్ముడు చనిపోయాడు అంటూ గుర్తుచేసుకొని బాగా ఏడ్చాడు.

తన తమ్ముడు చనిపోయేముందు మాట్లాడిన కొన్ని మాటలు గుర్తు చేసుకొని తెలిపాడు విశ్వ.అలా గుర్తొచ్చాడు అని అందుకే ఏడ్చాను అంటూ.

ఇక ఏడవను అంటూ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు.ఇక ఈ సీన్ బాగా ఎమోషనల్ గా సాగగా.

ఇది చూసిన నెటిజన్లు కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశారు.మరికొందరు ఇదంతా బిగ్ బాస్ లో పబ్లిసిటీ కోసం స్టంట్ అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube