బుల్లితెర యాంకర్ గా విష్ణుప్రియ మంచి పేరును, గుర్తింపును సొంతం చేసుకున్నారు.తాజాగా ప్రసారమైన కామెడీ స్టార్స్ షోకు విష్ణుప్రియ గెస్ట్ గా హాజరు కావడంతో పాటు అవినాష్ స్కిట్ లో వేసిన పంచ్ లు ప్రోమోకు హైలెట్ అయ్యాయి.
శ్రీమంతుడు సినిమాలోని చారుశీల పాటతో విష్ణుప్రియ షోలోకి ఎంట్రీ ఇస్తారు.శేఖర్ మాస్టర్ చీరలో ఉన్న విష్ణుప్రియను చూసి మంచి తనకు మంచి అమ్మాయి వస్తుందని చెప్పారని కానీ ఈమె వచ్చిందని అంటారు.
ఆ తరువాత అవినాష్ భూపతిరావ్ అంటూ పెదరాయుడు లాంటి గెటప్ లో ఎంట్రీ ఇచ్చి విష్ణుప్రియకు పొరపాటున తగులుతాడు.విష్ణుప్రియ సారీ మాస్టర్ అని చెప్పగా మాస్టర్ కాదు తాతయ్య అని పిలవమని శేఖర్ మాస్టర్ చెబుతాడు.
విష్ణుప్రియ ఐయామ్ సారీ భూపీ అనగా పెంచకు నాలో బీపీ అని అవినాష్ సమాధానమిస్తాడు.ఆ తరువాత విష్ణుప్రియ ఒకసారి స్కిట్ లో నుండి బయటకు రావా అని అవినాష్ చెబుతాడు.
ఆ తరువాత విష్ణుప్రియ నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా విష్ణుప్రియ అడగగా నాలో నీకు ఏం నచ్చిందని అవినాష్ విష్ణుప్రియను అడుగుతాడు.మన ముక్కులు కలిశాయి పెళ్లి చేసుకుంటే ఓంకార్ ఇచ్చే చెక్కులు కూడా కలుస్తాయని విష్ణుప్రియ చెబుతుంది.అబ్బాయి పుడితే ముఖేష్ అని అమ్మాయి పుడితే ముఖ్యవర్తి అని పేరు పెడదామని అనుకున్నానని విష్ణుప్రియ వెల్లడిస్తారు.
మన అన్ని ముక్కులు కలిసి ముక్కాలా ముక్కాబులా అని డ్యాన్స్ వేయవచ్చని విష్ణుప్రియ వెల్లడిస్తారు.
ఆ తర్వాత అవినాష్ ఆపు ఈ ముక్కుల గోలేంటి అని అంటాడు.భూపి నీ కళ్లలో ఏదో కనిపిస్తుంది అని విష్ణుప్రియ చెప్పగా ఏమిటి అని అవినాష్ అడుగుతాడు.
నీ కళ్లలో కరువు కనిపిస్తుందని విష్ణుప్రియ చెప్పగా అయితే కరవకముందే వెళ్లిపొమ్మని అవినాష్ అంటాడు.అవినాష్ విష్ణుప్రియ స్కిట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.