జనసేనలో చేరే ప్రసక్తే లేదు..???

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున బీజీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యన్నారాయణని పార్టీ కండువా కప్పి మరీ జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.దాంతో ఇప్పుడు అందరి దృష్టి బీజేపీ పై పడింది.

 Vishnukumar Raju Not Joining In To Janasena Party-TeluguStop.com

బీజేపీ నుంచీ ఇంకా ఎవరెవరు జనసేనలోకి వెళ్లనున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి.ఈ క్రమంలోనే అందరి చూపు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై పడింది.

ఆయన సైతం పార్టీ మారనున్నారు అంటూ వార్తలు రావడంతో ఒక్క సారిగా బీజేపీ ఉలిక్కిపడింది.దాంతో విష్ణు తో కీలక ప్రకటన చేయించింది.

అయితే ఏపీలో తాజాగా జరిగిన రాజకీయ పరిణామాల గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ విష్ణుకుమార్ రాజు క్లారిటీ ఇచ్చి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను బీజేపీలోనే ఉంటానని ఎత్తి పరిస్థితుల్లోను పార్టీ మారబోనని స్పష్టం చేశారు.అంతేకాదు జనసేన , టీడీపీ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ అంటే బీ అంటే బీజేపీ , జే అంటే జగన్, పీ అంటే పవన్ కల్యాణ్ అని టీడీపీ నేతలు విమర్శించారని గుర్తు చేశారు.

కానీ రాబోయే ఎనికల్లో పొత్తు లేకుండా గెలవడం కష్టమని గుర్తించిన బాబు ఇప్పుడు పవన్ పై పొత్తు కోసం తహతహలాడుతున్నారని , అందుకే గత కొంతకాలంగా జనసేన పార్టీపై విమర్శలు తగ్గాయని అంటున్నారు.అంతేకాదు పవన్ కళ్యాణ్ గాలి కూడా కాస్త టీడీపీ వైపు మళ్లుతోందని, బాబు పై గతంలోలా విమర్శలు చేయడం మానేశారని అన్నారు.మోడీ చేతిలో పవన్ కీలు బొమ్మ అంటూ కామెంట్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని , చంద్రబాబు కి ఇవేమీ కొత్త కాదని ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో గెలుపు భయంతోనే ఫించను పెంచడం , రకరకాల హామీలు ఇవ్వడం బాబు చేస్తున్నారని ఇదే ప్రేమ గతంలో ఎందుకు చూపించలేదు ఏపీ ప్రజలపై అంటూ మండిపడ్డారు.ఓట్ల కోసం బాబు స్వార్థంతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు ఏ మాత్రం పిచ్చి వాళ్ళు కాదని హెచ్చరించారు.వచ్చే ఎన్నికల్లో బాబు పరాభవం తప్పదని కేంద్రంలో బీజేపీ మరో సారి జెండా ఎగురవేస్తుందని జోస్యం చెప్పారు విష్ణు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube