'ఎన్టీఆర్‌' ఫ్లాప్‌కు కారణం చెప్పిన నిర్మాత

నందమూరి బాలకృష్ణ ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ దారుణమైన పరాజయం పాలయిన విషయం తెల్సిందే.సినిమా రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు డిజాస్టర్స్‌ను బాలయ్య ఖాతాలో వేసింది.

 Vishnu Vardhan Comments On Ntr Biopic Movie-TeluguStop.com

ఈ చిత్రంను బాలయ్యతో కలిసి విష్ణువర్ధన్‌ ఇందూరి నిర్మించాడు.ప్రస్తుతం ఈయన బాలీవుడ్‌లో ఇండియాకు మొదటి సారి ప్రపంచ కప్‌ వచ్చిన నేపథ్యంలో జరిగిన సంఘటనలు వివరిస్తూ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ను నిర్మిస్తున్నాడు.

అదే విధంగా తమిళంలో జయలలిత బయోపిక్‌ను కూడా ఈయన నిర్మిస్తున్నాడు.

Telugu Balakrishna, Ntr Biopic, Kapildev Biopic, Vishnu Vardhan, Vishnuvardhan-

ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.తమిళ చిత్రం అమ్మ బయోపిక్‌లో కంగనా నటిస్తున్న కారణంగా దేశ వ్యాప్తంగా ఆ చిత్రంపై అంచనాలు ఉన్నాయి.ఇటీవల దర్శకుడు విష్ణువర్ధన్‌ ఇందూరి ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఎన్టీఆర్‌ ఫలితంపై అతడు క్లీయర్‌గా స్పందించాడు.తాము చేసిన తప్పులకు భారీ ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు.

ముఖ్యంగా సినిమాను రెండు పార్ట్‌లుగా చేయడం తప్పుడు నిర్ణయం అని తమకు తర్వాత తెలిసిందన్నాడు.

సినిమాలో ప్రేక్షులు ఆశించిన కొన్ని కీ పాయింట్స్‌ను మేము చూపించలేదు.

అందువల్ల ప్రేక్షకులు సినిమాను ఆధరించలేదని ఆయన అన్నాడు.ఎన్టీఆర్‌ చిత్రం తన కెరీర్‌లోనే పెద్ద గుణపాఠంగా మిగిలి పోతుందని చెప్పుకొచ్చాడు.

తాను చాలా వరకు మళ్లీ అలాంటి తప్పులు చేయను అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు.క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఒక అద్బుతం అంటూ మొదటి నుండి ప్రచారం చేశారు.

కాని అద్బుతం కాదు కదా కనీసం పర్వాలేదు అన్నట్లుగా కూడా ఆడలేదు.అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.100 కోట్లు అనుకుంటే కనీసం 20 కోట్లు వచ్చిన పరిస్థితి లేదు.నిర్మాతలు మరియు బయ్యర్లు నిండా మునిగారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube