స్టార్ డైరెక్టర్ తో మంచు విష్ణు.. హిట్ గ్యారంటీ..?  

Manchu Vishnu and Srinu Vaitla Dhee Movie Sequel announcement soon, Manchu Vishnu, Srinu vaitla, Dhee Movie Sequel, 13years compelted, Manchu Vishnu Twitter - Telugu 13years Compelted, Dhee Movie Sequel, Dhee Sequel Update, Manchu Vishnu, Manchu Vishnu And Srinu Vaitla Dhee Movie Sequel Announcement Soon, Manchu Vishnu Twitter, November 23rd 2020, Srinu Vaitla

హీరో మంచు విష్ణు, స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కి 2007లో విడుదలైన ఢీ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.హీరోహీరోయిన్లుగా విష్ణు జెనీలియా అద్భుతంగా నటించడంతో పాటు బ్రహ్మానందం కామెడీ, శ్రీనువైట్ల దర్శకత్వ ప్రతిభ ఆ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి.

TeluguStop.com - Vishnu Sreenu Vaitla Dhee Sequel Movie Announcement

ఇప్పటికీ ఢీ సినిమా టీవీలో ప్రసారమైతే అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటోంది.
మంచు విష్ణు సినిమా కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచిన ఢీ సినిమాకు సీక్వెల్ వస్తుందని చాలా సంవత్సరాల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఈరోజు మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా “వేల సంఖ్యలో సినీ ప్రేక్షకులకు ఢీ సినిమా ఫేవరెట్ సినిమా అని.ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ పరంగా గేమ్ ఛేంజర్ అని.ఢీ సినిమా ఎన్నో చిత్రాలకు మార్గదర్శకంగా నిలిచింది” అని పోస్ట్ లో పేర్కొన్నారు.నవంబర్ 23వ తేదీన ఎగ్జైటింగ్ అప్ డేట్ ఉంటుందంటూ పోస్టర్ వదిలారు.

TeluguStop.com - స్టార్ డైరెక్టర్ తో మంచు విష్ణు.. హిట్ గ్యారంటీ..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ పోస్టర్ లో మంచు విష్ణు ఢీ సినిమా గురించి ప్రస్తావించడంతో ఢీ సీక్వెల్ తెరకెక్కనుందని మంచు విష్ణు ఫ్యాన్స్ భావిస్తున్నారు.గత కొన్నేళ్లుగా మంచు విష్ణు, శ్రీను వైట్ల కెరీర్ విషయంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు.ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఢీ సీక్వెల్ వస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని విష్ణు, శ్రీనువైట్ల ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి విష్ణు ఢీ సీక్వెల్ గురించే చెప్పబోతున్నాడా.? లేక మరో కొత్త సినిమా గురించి చెప్పబోతున్నారా…? తెలియాలంటే 23 వరకు ఆగాల్సిందే.

ఈ ఏడాది ఏప్రిల్ 13తో ఢీ సినిమా 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో శ్రీనువైట్ల ఢీ సినిమా తనకు ప్రత్యేకమైన సినిమా అని.మరిచిపోలేని జ్ఞాపకమని అన్నారు.మంచు విష్ణు పెట్టిన పోస్ట్ తో ఢీ సీక్వెల్ గురించి క్లారిటీ వచ్చినట్టేనని విష్ణు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

#ManchuVishnu #Srinu Vaitla #Manchu Vishnu #ManchuVishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vishnu Sreenu Vaitla Dhee Sequel Movie Announcement Related Telugu News,Photos/Pics,Images..