నామినేషన్ తర్వాత విష్ణు సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మా అధ్యక్ష ఎన్నికలు అగ్గి రాజేస్తున్నాయి.మా అధ్యక్ష పదవి కోసం ఎన్నడూ లేని విధంగా చాలా మంది పోటీ పడుతున్నారు.

 Vishnu Sensational Comments After Nomination Vishnu, Pawan Kalyan, Maa Elections-TeluguStop.com

గతంలో ఇద్దరూ మాత్రమే పోటీ పడుతూ ఉండగా ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువగా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండటంతో.అక్టోబర్ 10 న జరగబోయే మా అధ్యక్ష ఎన్నికలు కీలకంగా మారాయి.
;

ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఈ రోజు అతని ప్యానల్ సభ్యులతో కలసి.మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కిపత్రాలను సమర్పించారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్ చేశారు. మా ప్యానెల్ సభ్యులు అందరం కలిసి నామినేషన్ వేయడం జరిగింది కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం బలంగా ఉందని తెలిపారు.

Telugu Maa, Pawan Kalyan, Prakash Raj, Vishnu, Ys Jagan-Telugu Political News

ఇది ప్రతి తెలుగు నటులు ఆత్మగౌరవ పోరాటం.నా వెనకాల జగన్ ఉన్నట్లు కొన్ని మీడియా ఛానల్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి.వాటిలో వాస్తవం లేదు నాకు తొమ్మిది వందల మంది సభ్యుల మద్దతు ఉందని స్పష్టం చేశారు.నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా ఓట్లు వేస్తారు అని చెప్పుకొచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు గురించి నాన్నగారు మాట్లాడుతారని తెలిపారు.ఇండస్ట్రీకి సంబంధించి అంటే పవన్ చేసిన వ్యాఖ్యలు విషయంలో ఏకీభవించడం లేదనితామంతా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైపు ఉన్నామని వారు తీసుకున్న స్టాండ్ కి మేము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

మరి పవన్ చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రకాష్ రాజ్ ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటారో చెప్పాలి అంటూ మంచు విష్ణు మీడియా ముందు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube