విష్ణుసాలగ్రామ పూజ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారో తెలుసా?

కార్తీక మాసం ఎన్నో పూజలు, వ్రతాలు, శుభకార్యాలకు ప్రసిద్ధిచెందినది.ఇలాంటి పూజలో భాగంగా సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నందు కరోనా విస్తరిస్తున్న సమయంలో లోక సంరక్షణకోసం టీటీడీ ఓ పవిత్రమైన కార్యక్రమాన్ని తలపెట్టారు.

 Vishnu Salagrama Pooja History, Hindu God, Hindu Believes, Karthika Masam-TeluguStop.com

ఇందులో భాగంగా గురువారం విష్ణు సాలగ్రామ పూజను ఎంతో వేడుకగా తిరుమల వసంత మండపంలో జరిగింది.అయితే ఈ పూజను ఎందుకు చేస్తారు? ఈ పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం….

ఈ పూజలో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారిని ఈ మండపంలో ఉంచుతారు.ఈ వసంత మండపంలో శ్రీభూవరాహస్వామి, శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా,వీటితో పాటు కార్తీక మాసంలో ఎంతో పరమపవిత్రంగా భావించే ఉసిరిచెట్టు, కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మి తులసి మొదలైనటువంటి పవిత్రమైన చెట్లను కూడా ఏర్పాటుచేసి విష్ణు సాలగ్రామ పూజలను నిర్వహిస్తారు.

ఈ పూజలో భాగంగా మంటపములో కొలువై ఉన్న విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం వంటి తదితర పదార్థాలతో అభిషేకాలు నిర్వహించి పూజలు నిర్వహించి ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తారు.అనంతరం క్షమా మంత్రం, మంగళ హారతులతో ఈ పూజను ముగిస్తారు.

ఈ విష్ణు సాలగ్రామ పూజలో పాల్గొనడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.

సాలగ్రామాలు అంటే సాక్షాత్తు ఆ విష్ణు అవతారమని, ఈ సాలగ్రామ పూజలు నిర్వహించడం వల్ల సర్వ లోకం మొత్తం రక్షించబడుతుంది.

అంతేకాకుండా సమస్త పాపాలు తొలగిపోయి, సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంటారని వేదపండితులు తెలియజేస్తున్నారు.అంతేకాకుండా సాలగ్రామాలకు చేసిన అభిషేకాన్ని తీర్థ ప్రసాదంగా సేవించటం వల్ల సమస్త పాపాలు తొలగిపోవడమే కాకుండా, సర్వ వ్యాధులు కూడా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube