బోర్ గా ఉందన్న మంచు విష్ణు.. ఒక ఆట ఆడుకుంటున్న నెటిజన్స్?

ఇటీవల జరిగిన మా ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.అయితే గత రెండు రోజులుగా మళ్లీ మా వ్యవహారాలు రచ్చకెక్కుతున్నాయి.

 Netizens Trolls On Manchu Vishnu Photo,manchu Vishnu , Maa President, Maa Electi-TeluguStop.com

మా కార్యాలయానికి తాళాలు వేశారని, మా ఎన్నికల సమయంలో చేసిన హామీలలో ఒక్కటి కూడా అమలు పరచడం లేదని, ఇంతవరకు ఏం చేస్తున్నారు అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తున్నారు.అలాగే డాన్సర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి పై టాలీవుడ్ ఆలస్యంగా స్పందించడం, మా అధ్యక్షుడు మంచు విష్ణు పట్టించుకోకపోవడంపై ట్రోలింగ్స్ జరిగాయి.

ఈ క్రమంలోనే ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడానని, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని మంచు విష్ణు చేసిన ట్వీట్ పై నెగిటివ్ కామెంట్లు వచ్చాయి.మాట్లాడటం ఏంటి? ప్రార్థించడం ఏంటి? ఆర్థిక సహాయం చేశారా? లేదా అంటూ ఏకిపారేశారు.అలాగే మంచు విష్ణు తాజాగా బోర్ ఫీల్ అవుతున్నాను తీరిగ్గా అలా సేదతీరుతున్న అంటూ ఒక ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో పై కూడా నెటిజన్లు ట్రోలింగ్స్ చేశారు.

ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ ఈ సినిమాలు చూసినప్పుడు కూడా మాకు అలాంటి ఫీలింగ్ వస్తుంది అని కామెంట్ పెట్టాడు.మరొక నెటిజెన్ స్పందిస్తూ ముందు మీ బావతో మాట్లాడి టికెట్ ఇష్యూ చూడరాదె.మా బిల్డింగ్ కట్టించుకో బోర్ ఉండదు.

మోసగాళ్లు సీక్వెల్ సినిమా తియ్యి బోర్ కొట్టదు అంటూ కామెంట్ చేశాడు.అధ్యక్షుడిగా ఉండి కూడా మీరు సినిమా టికెట్ల పై జరుగుతున్న సంఘటనలపై స్పందించి లేకపోతున్నారు.

గెలిస్తే అయిపోదు వెళ్లి మా అసోసియేషన్ పనులు చూడు అంటూ కామెంట్ తో మంచు విష్ణుని దారుణంగా ట్రోల్స్ చేశారు.మరి ఈ విషయంపై మంచు విష్ణు ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube