మోసగాళ్ళులో అన్నా చెల్లెళ్ళుగా కాజల్ అగర్వాల్, మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో మోసగాళ్ళు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.

 Vishnu Manchu, Kajal Aggarwal Play Siblings In Mosagallu, Tollywood, Telugu Cine-TeluguStop.com

ఇండో-హాలీవుడ్ మూవీగా ఇది ఉండబోతుంది.ఇండియాలో జరిగిన అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపధ్యంలో ఈ మోసగాళ్ళు సినిమా కథ ఉండబోతుంది అని ఇప్పటికే చెప్పేశారు.

ఇక ఈ సినిమాకి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటి వరకు అతని కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని మంచు విష్ణు నిర్మిస్తున్నాడు.

ఏవీఏ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ భాగస్వామిగా ఉంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కీలక పాత్రలని ఫస్ట్ లుక్ ద్వారా పరిచయం చేసి సినిమా మీద ఇంటెన్సన్ క్రియేట్ చేశారు.

ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది.

అయితే ఈ సినిమాలో ఎవరూ ఊహించని పాయింట్ ని చిత్ర యూనిట్ తాజాగా రివీల్ చేసింది.

ఇందులో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ అన్నా చెల్లెళ్ళుగా కనిపిస్తారని ప్రకటించారు.కథలో వారి ఇద్దరు పాత్రలు చాలా కీలకంగా ఉండబోతున్నాయని స్పష్టం చేశారు.తెలుగు సినిమాలో ఒక స్టార్ హీరోయిన్, ఒక స్టార్ హీరో అన్నాచెల్లెళ్ళుగా నటించిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి.రమ్యకృష్ణ కెరియర్ ఆరంభంలో చిరంజీవికి చెల్లెలుగా నటించింది.

అలాగే ఎన్టీఅర్, సావిత్రి అన్నాచెల్లెళ్ళుగా ఒక సినిమాలో నటించారు.అలాగే శోభన్ బాబు, శ్రీదేవి కూడా అన్నా చెల్లెళ్ళుగా నటించారు.

ఇలా స్టార్ హీరో, హీరోయిన్స్ ఇద్దరు అన్నా చెల్లెళ్ళుగా నటించడం అంటే ఆసక్తికరమైన విషయం అని చెప్పాలి.మరి చాలా కాలం తర్వాత తెలుగులో ఈ రకమైన కాంబినేషన్ ని ట్రై చేసిన మంచు విష్ణుకి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.లాక్ డౌన్ పరిస్థితులు సెట్ అయితే త్వరలో మిగిలిన భాగం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube