ఆ ట్విట్టర్ తనది కాదంటున్న వైష్ణవ తేజ్

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి సంబంధించి ఫేక్ ప్రోఫైల్స్ ఎక్కువగా ఉంటాయి.వారి ప్రొఫైల్స్ ఉపయోగించుకొని కొంత మంచి మోసాలకి పాల్పడుతూ ఉంటారు.

 Vaishnav Tej Gives Clarity On Fake Twitter Profile, Social Media, Uppena Movie,-TeluguStop.com

అలాగే ఫ్యాన్స్ ని తప్పుదోవ పట్టించడం, తప్పుడు పోస్టులు పెట్ట వారి మీద నెగిటివిటి పెరిగేలా చేస్తూ ఉంటారు.సోషల్ మీడియాలో ఈ రకమైన విషసంస్కృతి ఈ మధ్య కాలంలో భాగా ఎక్కువైంది.

ఎవరైనా కాస్తా గుర్తింపు పొందిన వ్యక్తి ఉంటే అతని పేరు మీద పదుల సంఖ్యలో ఫేక్ ప్రోఫైల్స్ వస్తూ ఉంటాయి.వాటిలో ఏది రియల్ అనేది తెలుసుకోవడం కష్టం.

ఇలా ఫేక్ ప్రోఫైల్స్ బెడద ఈ మధ్య సాధారణ ప్రజలకి కూడా ఎక్కువైపోయింది.ఒక్కోసారి ఈ ఫేక్ ప్రోఫైల్స్ పై సెలబ్రిటీలు నేరుగా స్పందించాల్సి వస్తుంది.

తాజాగా వైష్ణవ్ తేజ్ కి సంబందించిన ఫేక్ ట్విట్టర్ ప్రోఫైల్ పై నేరుగా అతనే క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఉప్పెన హీరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పేరుతో ఒక ట్విట్టర్ ప్రొఫైల్ ఇటీవల వైరల్ గా మారింది.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వడంతో ఆ ప్రొఫైల్ ని చాలామంది ఫాలో అయ్యారు.కాస్తా ఆకర్షనీయంగా ప్రొఫైల్ ఉండటంతో అది రియల్ అనే అందరూ అనుకున్నారు.

అయితే ఆ ప్రొఫైల్ వైరల్ గా మారడంతో వైష్ణవ్ తేజ్ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.నిజానికి తాను ట్విట్టర్ లో లేనని ఆ ట్విట్టర్ ప్రొఫైల్ తనది కాదని వైష్ణవ్ తాజాగా స్పష్టం చేశారు.

తన పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఫ్యాన్స్ ని తప్పుదారి పట్టిస్తున్నారని స్పష్టం చేశాడు.ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల జాగ్రత్త వహించండి అంటూ వైష్ణవ్ ఒక వివరణను ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube