ఆస్ట్రేలియాలో సిక్కులపై దాడులు.. భారత్‌లో ఎన్ఆర్ఐ యువకుడికి హీరో రేంజ్‌లో వెల్‌కమ్

విశాల్ జూడ్ అనే 24 ఏళ్ల ఎన్ఆర్ఐ యువకుడు గుర్తున్నాడా… సిక్కు సమాజానికి వ్యతిరేకంగా దాడులకు పాల్పడి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అరెస్ట్‌కు గురై దోషిగా నిర్థారించిన సంగతి తెలిసిందే.విశాల్ ఈ వారాంతంలో హర్యానాలోని కురుక్షేత్రకు చేరుకోవడంతో భారీ స్వాగత సత్కారాలను అందుకున్నాడు.

 Vishal Jood Convicted For Alleged Communal Attacks Against Sikhs In Sydney Gets-TeluguStop.com

ఆయన ఇటీవలే ఆరు నెలల శిక్షను అనుభవించాడు.అయితే ఆస్ట్రేలియన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు విశాల్‌ను భారతదేశానికి బహిష్కరించారు.

కురుక్షేత్రలోని స్థానిక ధర్మశాలకు వెళ్లేందుకు పానిపట్‌కు వచ్చిన విశాల్ జూడ్‌కు రోర్ సామాజిక వర్గానికి చెందిన 200 మంది యువకులు స్వాగతం పలికారు.అనంతరం ఆయనను ర్యాలీగా ధర్మశాల వరకు తీసుకెళ్లారు.

విశాల్ దేశ బహిష్కరణపై ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి అలెక్స్ హాక్ మాట్లాడుతూ.ఆస్ట్రేలియా సామాజిక సమైక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు.

24 ఏళ్ల విశాల్ జూడ్ హర్యానాకు చెందిన వాడు.ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాకు వచ్చిన అతను ఈ ఏడాది ఏప్రిల్ 16న సిడ్నీలో మూడు నేరాలకు పాల్పడినందుకు గాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఖలిస్తానీ వేర్పాటువాదులు, భారత జాతీయవాదుల ఘర్షణ నేపథ్యంలో ఆయన అరెస్ట్ జరిగింది.అయితే ఈ మూడు కేసుల్లోనూ ఖలిస్తానీయులు బాధితులుగా పేర్కొనబడ్డారు.ఖలిస్తానీయులు.భారత ప్రవాసుల మధ్య ఏళ్లుగా శత్రుత్వం వున్న సంగతి తెలిసిందే.

వివిధ దేశాల్లో వున్న ఖలిస్తానీయులు తాము భారతీయ సంతతికి చెందిన వారమని ఒప్పుకున్నప్పటికీ.భారతీయులమని మాత్రం అంగీకరించరు.

వారి లక్ష్యం ఖలిస్తానీ రాజ్య సాధనే.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆగస్ట్ 28, 2020న పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

కొందరు టిక్ టాక్‌లో భారత వ్యతిరేక సమాచారాన్ని వ్యాప్తి చేయడమే దీనికి కారణమని పోలీసులు తేల్చారు.

Telugu Communal Sikhs, Haryana, Indianorigin, Khalistan Sikhs, Sikh Community, S

ఆ రోజు ఖలిస్తానీయులు, భారత జాతీయ భావజాలం వున్న రెండు గ్రూపులు స్థానిక హారిస్ పార్క్ వద్ద ఘర్షణకు దిగాయి.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న జాస్సీ తీవ్రంగా గాయపడ్డారు.అయినప్పటికీ అతను మాత్రం వెనక్కి తగ్గలేదు.

హిందువులను బెదిరించడం మొదలుపెట్టాడు.అంతేకాకుండా ఒంటరిగా కనిపిస్తే వారిని చితకబాదుతానని చెప్పాడు.

ఇదే సమయంలో భారత్‌లో వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు- కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.పంజాబ్‌, హర్యానా, ఢిల్లీలో రైతుల ఆందోళనల నేపథ్యంలో ఖలిస్తానీయులు యాక్టీవ్ అయ్యారు.

రైతులకు వీరు బహిరంగంగా మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియాలోనూ కొందరు భారత వ్యతిరేక నిరసనలు చేపట్టారు.

Telugu Communal Sikhs, Haryana, Indianorigin, Khalistan Sikhs, Sikh Community, S

ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఖలిస్తానీయులు సిడ్నీలోని హారీస్ పార్క్ సమీపంలోకి వెళ్లి.భారతీయుల ఆస్తులను, కార్లను ధ్వంసం చేశారు.ఇదే సమయంలో ఏప్రిల్ 16 తర్వాత విశాల్ జూడ్‌ను సిడ్నీలోని అతని ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ ఘర్షణల్లో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.ఖలిస్తానీయులకు మద్ధతుగానే ఆస్ట్రేలియా పోలీసులు ఉద్దేశపూర్వకంగా విశాల్‌ను అరెస్ట్ చేశారనే వాదనలు వినిపించాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 1న.విశాల్ న్యాయవాది ప్రాసిక్యూటర్లతో ఒక ఒప్పందానికి వచ్చారు.దీని ప్రకారం.

మూడు గొడవల్లో విశాల్ నేరాన్ని అంగీకరించడంతో మిగిలిన ఆరోపణలను ప్రాసిక్యూటర్లు ఉపసంహరించుకున్నారు.దీంతో విశాల్ విడుదలకు మార్గం సుగమమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube