త్వరలో నడిగర్ సంఘం ఎన్నికలు...మరోసారి పోటీకి సిద్దమైన విశాల్  

Vishal In Nadigar Sangham Elections-chennai,nadigar Sangham,sharath Kumar,vishal,శరత్ కుమార్,హీరో విశాల్

కోలీవుడ్ లో నడిగర సంఘం ఎన్నికలు జరగనున్నాయి. 2019 వ సంవత్సరానికి గాను జరగబోతున్న ఈ ఎన్నికల్లో హీరో విశాల్ మరోసారి పోటీ చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో విశాల్ భారీ మెజార్టీ తో విజయం సాధించి నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మాజీ నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ తో పలు సందర్భాల్లో గొడవ పడ్డారు కూడా..

త్వరలో నడిగర్ సంఘం ఎన్నికలు...మరోసారి పోటీకి సిద్దమైన విశాల్ -Vishal In Nadigar Sangham Elections

అంతేకాకుండా ఇటీవల నడిగర్ సంఘం తో కూడా పలు తలనొప్పులు ఎదురుకొంటున్న సంగతి కూడా తెలిసిందే.

ఈ నేపథ్యంలో విశాల్ ఈ సారి ఈ ఎన్నికల్లో పోటీ కి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విశాల్ తన నామినేషన్ పేపర్లను నడిగర సంఘానికి సమర్పించారు. విశాల్ నటించిన అయోగ్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూనే… సినిమాలు చేస్తున్నాడు. సినీ రంగానికి సంబంధించిన సమస్యలపై పోరాటం చేస్తున్నాడు. అయితే ఈ సారి ఎన్నికల్లో విశాల్ ఎంతవరకు విజయం సాధిస్తారు అన్న విషయం సస్పెన్స్ గానే ఉంది.