వచ్చే ఏడాది తన తెలుగు సినిమా ఉంటుంది అంటున్న విశాల్

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించిన చక్ర మూవీ ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే.తెలుగు, తమిళ బాషలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సైబర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు.

 Vishal Confirm Straight Telugu Movie, Telugu Cinema, South Cinema, Chakra Movie,-TeluguStop.com

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచుతుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విశాల కి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుంది.

ఇక రెజినా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.ఆనందన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత విశాల్ ఎనిమీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక తెలుగువాడైన కోలీవుడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ఇప్పటి వరకు స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించలేదు.

అతని సినిమాలు అన్ని తమిళంలో తెరకెక్కి తరువాత తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతున్నవే.ఇదిలా ఉంటే చక్ర సినిమా ప్రమోషన్ సందర్భంగా విశాల్ మీడియా అడిగిన ప్రశ్నలలో భాగంగా తన స్ట్రైట్ తెలుగు సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.

చాలా కాలం నుంచి తెలుగు సినిమా చేయమని ఇక్కడి ప్రేక్షకులు కోరుకుంటున్నారని, అయినా కుదరడం లేదని చెప్పాడు.అయితే వచ్చే ఉగాది నాటికి తన స్ట్రైట్ తెలుగు సినిమా కచ్చితంగా రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు.

ఈ నేపధ్యంలో తెలుగు సినిమా కోసం ఇప్పటికే విశాల్ దర్శకుడుని ఫైనల్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది.అయితే ఆ దర్శకుడు ఎవరనే విషయం మీద విశాల్ క్లారిటీ ఇవ్వకపోయిన త్వరలో కచ్చితంగా స్ట్రైట్ తెలుగు సినిమాని పట్టాలు ఎక్కించడం గ్యారెంటీగా కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube