హీరో విశాల్ ని నిలువునా మోసం చేసిన మహిళ  

Vishal cheated by woman police complaint lodged, Tollywood, Kollywood, Vishal Film Factory - Telugu Kollywood, Tollywood, Vishal Cheated By Woman Police Complaint Lodged, Vishal Film Factory

విశాల్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.అలాగే తమిళ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ ప్యానల్ లో విశాల్ కీలక పదవులలో కొనసాగుతున్నారు.

 Vishal Cheated By Woman Police Complaint Lodged

తమిళ రాజకీయాలలో కూడా విశాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.విశాల్ హీరోగా తెరకెక్కే సినిమాలకి అతనే నిర్మాతగా ఉంటాడు.

చాలా వరకు బయటి ప్రొడక్షన్స్ కి దూరంగా ఉంటాడు.ఇక తన సినిమాల కోసంవిశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని నడుపుతున్నాడు.

హీరో విశాల్ ని నిలువునా మోసం చేసిన మహిళ-Movie-Telugu Tollywood Photo Image

ఈ మధ్య విశాల్ సైబర్ ఆర్ధిక నేరాల నేపధ్యంలో అభిమన్యుడు, తాజాగా చక్ర సినిమాలు తీసాడు.అయితే అతని ఫిల్మ్ ఫ్యాక్టరీలో జరుగుతున్నా ఆర్ధిక నేరాన్ని గుర్తించడానికి చాలా సమయం తీసుకున్నాడు.

ఈ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ మహిళే ఈ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు తెలిసింది.ఆరేళ్లుగా విశాల్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఆమె పలు దఫాల్లో కోట్లు కొల్లగొట్టినట్టు తెలిసింది.

ఇటీవలే ఆమె 45 లక్షలు పెట్టి ఓ ఇంటిని కొనుగోలు చేయడంతో ఆమెపై అనుమానం కలిగింది.డబ్బులు మాయంపై విచారణ జరిపిన విశాల్ కు ఈ మహిళనే చాలా రోజులుగా కాజేస్తోందని ఆడిటింగ్ లో తేలడంతో వెంటనే విశాల్ ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో ఆ మహిళ మోసం బయటపడింది.నిర్మాతగా చాలా ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ బిజినెస్ మెన్ గా కూడా తన మార్క్ చూపిస్తున్న విశాల్ ని ఒక మహిళ మోసం చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

#Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vishal Cheated By Woman Police Complaint Lodged Related Telugu News,Photos/Pics,Images..