ఓటీటీలోనే విశాల్ చక్ర కూడా... సొంతం చేసుకున్న జీ5

ఇప్పుడున్న పరిస్థితిలో సినిమాలని థియేటర్ లో రిలీజ్ చేయలేని పొజిషన్ ఉండటంతో సౌత్ స్టార్ హీరోలు అందరూ ఒకరి తర్వాత ఒకరుగా అందరూ ఓటీటీ బాట పడుతున్నారు.ఓటీటీ చానల్స్ సౌత్ సినిమాలకి కూడా డిజిటల్ రైట్స్ రూపంలో భారీ మొత్తంలో ఆఫర్ చేస్తూ ఉండటంతో పాటు, థియేటర్ లు ఇప్పట్లో ఎలాగూ తెరిచే అవకాశం లేకపోవడంతో నిర్మాతలు రిలీజ్ కి రెడీ అయిపోతున్నారు.

 Vishal Chakra Movie Ready To Release In Ott, Digital Entertainment, Ott Platform-TeluguStop.com

ఇప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ తో పాటు కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాత కూడా తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయారిటీ ఇస్తున్నారు.ఇక డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు తమ వ్యూవర్ షిప్ పెంచుకోవడానికి రిలీజ్ కి రెడీగా ఉన్న అన్ని సినిమాల మీద ఫోకస్ పెట్టి వారి కంటే ముందుగానే బెస్ట్ ఆఫర్ తో నిర్మాతలని సంప్రదిస్తున్నారు.

దీంతో నిర్మాతలు ఆ ఆఫర్ కి టెంప్ట్ అవుతూ ఓటీటీ రిలీజ్ కి ఒకే చెప్పేస్తున్నారు.ఈ నేపధ్యంలోనే దిల్ రాజు వి సినిమాని అమెజాన్ ప్రైమ్ వారికి అమ్మేశారు.

అలాగే సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ఆకాశం నీ హద్దురా సినిమాని కూడా అమెజాన్ ప్రైమ్ కి అమ్మేశారు.ఇక అనుష్క నిశ్శబ్దం సినిమాని కూడా అమెజాన్ వాళ్ళు కొనేశారు.

మరోవైపు రిలీజ్ కి రెడీగా ఉన్న తేజ్ సోలో బ్రతుకు, రామ్ రెడ్ మూవీలకి కూడా స్ట్రీమింగ్ సంస్థలు మంచి ఆఫర్ ఇచ్చాయి.ఇదిలా ఉంటే విశాల్ హీరోగా తెరకెక్కిన చక్ర మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.

ఈ సైబర్ క్రైమ్స్ నేపధ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి జీ5 ఛానల్ మంచి ఆఫర్ ఇవ్వడంతో తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని డైరెక్టుగా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనున్నారు.అయితే ఈ సినిమాని ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు అని డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు.

ఏది ఏమైనా డిజిటల్ లో సినిమాలు రిలీజ్ చేయడం వలన సినిమా అందరికి చేరుతుందని సంతోషం ఉన్న, థియేటర్ ఫీలింగ్ మిస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube