ఆ ఇద్దరు టెన్నిస్ స్టార్స్ పై సినిమా తీయాలనుకుంటున్న విశాల్ భరద్వాజ్

ఈ మధ్యకాలంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్ లు ఎక్కువగా వస్తున్నాయి.సక్సెస్ అయిన వారి జీవిత కథలని తెరపై ఆవిష్కరిస్తూ హిట్స్ కొడుతున్నారు.

 Vishal Bhardwaj Wants To Make Film On Paes-bhupathi , Tollywood, Bollywood, Tenn-TeluguStop.com

బయోపిక్ కథల వలన నిర్మాతలకి లాభాలు రావడంతో ఒక సక్సెస్ ఫుల్ వ్యక్తి జీవన ప్రయాణం ఎలా సాగింది.తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎలాంటి అవరోధాలని దాటింది.

సంకల్ప బలం ఏ స్థాయిలో ఉందో అనే విషయం ఈ జెనరేషన్ వారికి తెలియజేసి స్ఫూర్తిని నింపే విధంగా కూడా ఉంటాయి.ఈ నేపధ్యంలో ఇలాంటి బయోపిక్ కథలని తెరపై ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆవిష్కరిస్తే వాటికి ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు.

సౌత్ లో బయోపిక్ లకి అంతగా గుర్తింపు లేకపోయినా నార్త్ ఇండియాలో మాత్రం మంచి సక్సెస్ అందుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఎక్కువగా క్రీడాకారుల బయోపిక్ లని తెరపై ఆవిష్కరిస్తున్నారు.

ఆరంభంలో క్రికెట్ లో రాణించిన వారిని తెరపై చూపించారు.తరువాత ఇతర క్రీడలలో సత్తా చాటిన వారి కథలని కూడా తెరపై ఆవిష్కరిస్తున్నారు.

ప్రస్తుతం సైనా నెహ్వాల్ బయోపిక్ రిలీజ్ కి రెడీ అవుతుంది.అలాగే కపిల్ దేవ్ జీవితంలో కీలక ఘట్టం అయిన వరల్డ్ కప్ అంశాన్ని తెరపై ఆవిష్కరించారు.

ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.

అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవిత కథని కూడా తెరపై సినిమా రూపంలో ప్రెజెంట్ చేయడానికి రంగం సిద్ధమైంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అవకాశం ఉంటే లియాండర్ పేస్, మహేష్ భూపతి కథని తెరపై ఆవిష్కరిస్తానని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ తెలియజేశారు.నేను ప్రస్తుతం ఏ క్రీడాకారుడి జీవితంపై సినిమా తీయాలని అనుకోను, కాని అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన సైనా నెహ్వాల్ బయోపిక్ చూడటానికి ఎదురు చూస్తున్నాను.అతను నాకు ఇష్టమైన చిత్ర నిర్మాతలలో ఒకడు.లియాండర్ పేస్, మహేష్ భూపతి జీవితంపై మనం ఖచ్చితంగా సినిమా తీయాలని భావిస్తున్నాను.

వారి జీవితాలపై సినిమా తీసే అవకాశం వస్తే నేను తప్పకుండా చేస్తానని విశాల్ భరద్వాజ్ తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube