డిటెక్టివ్ సీక్వెల్ తో దర్శకుడుగా మారుతున్న విశాల్!

తమిళ స్టార్ హీరో విశాల్ ఓ ఇప్పటికే నిర్మాతగా, హీరోగా తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.ఈ మధ్య కాలంలో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.

 Vishal Become A Director With Detective Movie Sequel-TeluguStop.com

ఇక ఆయన కెరియర్ లో వచ్చిన డిటెక్టివ్ సినిమా అతని కెరియర్ లో సూపర్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది.సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

మిస్కిన్ దర్శకత్వంలో తమిళంలో తుప్పరివాలన్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది.దీనిని తెలుగులో డిటెక్టివ్ గా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు.

ఇక ఈ డిటెక్టివ్ సినిమాకి సీక్వెల్ ఉంటుందని హీరో విశాల్ గతంలోనే ప్రకటించారు.తుప్పరివాలన్‌ 2 టైటిల్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇందులో హీరోగా విశాల్‌, అతడి స్నేహితుడిగా ప్రసన్న నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది.ఈ సినిమాని విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు.

అయితే బడ్జెట్‌, ఇతర విషయాల్లో హీరో, దర్శకుడి మధ్య గొడవలు జరగడంతో సినిమా నుంచి దర్శకుడు మిస్కిన్‌ తప్పుకున్నారని టాక్ వినిపిస్తుంది.దాంతో మిగతా సినిమాను తన దర్శకత్వంలో పూర్తి చేయాలని విశాల్‌ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.

అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అఫీషియల్ గా ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube