టెంపర్ తమిళ రీమేక్ ని మళ్ళీ తెలుగులో డబ్బింగ్ అంట!

ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమా తెలుగులో ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమాలో చివరి అరగంట ఎపిసోడ్ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టింది.

 Vishal Ayogya Movie Dubbing In Telugu-TeluguStop.com

ఇక ఈ సినిమా ఇప్పటికే హిందీలో సింబగ రిలీజ్ అయ్యి సూపర్ అయ్యింది.అకక్డ ఏకంగా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది.

ఇదిలా ఉంటే టెంపర్ సినిమా తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.మొత్తానికి రిలీజ్ అయిన అన్ని చోట్ల ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలో తాజాగా రిలీజ్ అయి టెంపర్ రీమేక్ అయోగ్య ని ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేయడానికి నిర్మాతలు సిద్ధం అవుతున్నారు.టాలీవుడ్ నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ అయోగ్య డబ్బింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతుందని, త్వరలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాని డబ్బింగ్ చేయడానికి కారనంగ్.సినిమాలో చివరి అరగంట ఎపిసోడ్ టెంపర్ మూవీకి పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని, అందుకే రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube