పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన విశాల్.. ఈసారి మాములుగా లేదుగా!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎన్నో మాస్ యాక్షన్ చిత్రాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న విశాల్ తెలుగు తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును పొందారు.

 Hero Vishal, Saamanyudu First Look, Vishal Birthday, Tollywood , Sharavan ,  Vis-TeluguStop.com

ఇప్పటివరకు విశాల్ తన కెరియర్ లో 30 సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే విశాల్ తన 31వ సినిమాను దర్శకుడు తు పా శరవణన్ దర్శకత్వంలో నటిస్తున్నారు.

తాజాగా యంగ్ హీరో విశాల్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా తన 31 వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ చిత్రబృందం విడుదల చేశారు.ఈ క్రమంలోనే విశాల్ నటిస్తున్నటువంటి 31 వ చిత్రానికి సామాన్యుడు అనే టైటిల్ ను చిత్రబృందం ఖరారు చేశారు.

ఈ క్రమంలోనే చిత్రబృందం వదిలిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుని ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది.

Telugu Vishal, Kollywood, Saamanyudu, Sharavan, Tollywood, Vishal St Filn-Movie

ఈ పోస్టర్ లో విశాల్ చేతిలో బేస్ బాల్ ఆల్ బ్యాట్ చేతిలో పట్టుకొని రౌడీలను చితకబాదుతున్నట్లు తెలుస్తోంది.ఈ పోస్టర్ లో విశాల్ పవర్ ఫుల్ లుక్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.ఈ చిత్రంలో విశాల్ సరసన టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తున్నారు.

విశాల్ ఫిలిం బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంబంధించిన విడుదల తేదిని త్వరలోనే చిత్రబృందం వెల్లడించనునట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube