అమరావతిపై విశాఖ తమ్ముళ్ళ సైలెన్స్...సైడ్ అవుతున్నారా..?

మూడు రాజధానుల్లో భాగంగా విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయబోతున్నామని ఎప్పుడైతే జగన్ ప్రకటించారో అప్పటి నుంచి, విశాఖలో టీడీపీ నేతల పరిస్తితి అయోమయంలో పడింది.అటు అమరావతికి మద్ధతు తెలపాలో లేక విశాఖలో రాజధాని పెట్టడాన్ని స్వాగతించాలో తెలియక ఫుల్ కన్‌ఫ్యూజ్ అయ్యారు.

 Vishaka Brothers Silence On Amaravathi, Amaravathi, Vishakha Brothers, Amaravath-TeluguStop.com

కాకపోతే మొదట్లో కొందరు అమరావతికి మద్ధతు తెలపగా, మరికొందరు విశాఖలో రాజధానిని స్వాగతించారు.

అయితే అమరావతికి మద్ధతు  తెలిపిన నేతలపై వైసీపీ కార్యకర్తలు పోరాటం చేస్తూ, హడావిడి చేశారు.

దీంతో వారు సైలెంట్ అయిపోయారు.తాజాగా అమరావతి ఉద్యమానికి 300 రోజులు పూర్తి అయిన సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.

ఇక అమరావతి గురించి విశాఖ తప్పా, అన్నీ జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.విశాఖలో సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తిలు తప్పా, మిగిలిన టీడీపీ నేతలు సైలెంట్‌గానే ఉండిపోయారు.

Telugu Amaravathi, Tdp, Vishakabrothers, Ycp-Telugu Political News

అయ్యన్న, బండారులు సైతం తమ ఇళ్ల దగ్గరుండే అమరావతి ఉద్యమానికి మద్ధతు తెలిపారు.ఇక ఒక్క ఎమ్మెల్యే కూడా అమరావతి కోసం గొంతు విప్పలేదు.విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఎలాగో పార్టీ మారారు.అటు నార్త్ ఎమ్మెల్యే గంటా టీడీపీలో ఉన్నా లేనట్టే.ఇక వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడిలో ఎవరు పని వారు చేసుకున్నారు.ఇక కొత్త పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్(విశాఖ), ఎమ్మెల్సీ నాగజగదీశ్వరావు (అనకాపల్లి), గుమ్మడి సంధ్యారాణి(అరకు) వీరు అసలు అమరావతి గురించి ఒక్క మాట మాట్లాడలేదు.

అలాగే మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు అమరావతి ఊసు ఎత్తలేదు.అంటే ఎక్కడ అమరావతికి మద్ధతుగా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో విశాఖ తమ్ముళ్ళు సైడ్ అయినట్లు తెలుస్తోంది.

దీని బట్టి చూసుకుంటే అమరావతి గురించి ఏమన్నా మాట్లాడితే విశాఖ ప్రజలు తిరస్కరిస్తారనే ఉద్దేశంతో టీడీపీ నేతలు సైలెంట్ అయినట్లు కనబడుతోంది.మొత్తానికైతే విశాఖలో అమరావతి ఫార్ములా వర్కౌట్ అవ్వడం లేదని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube