భారతీయులకి గుడ్ న్యూస్..వీసా గడువు పొడిగింపు..!!!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా అన్ని దేశాలపై కోలుకోలేని దాడులు చేస్తోంది.తీవ్ర స్థాయిలో ఆర్ధిక ప్రాణ నష్టాన్ని మిగుల్చుతున్న క్రమంలో అన్ని దేశాలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి.

 Uk,britain, H1b Visa Extension, Indians, Corona Effect-TeluguStop.com

ఈ క్రమంలోనే అమెరికా తనకి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి, అలాగే నిరుద్యోగ పరిస్థితులని అధిగమించడానికి వలస వాసులపై కొరడా జులిపించింది.దాంతో వీసాలపై ఆక్షలు విధిస్తూ ఎంతో మంది భారతీయులని ఇంటికి పంపే చర్యలు చేపట్టింది.

ఇదిలాఉంటే ఇలాంటి విపత్కర పరిస్థితులలో సైతం బ్రిటన్ భారతీయులకి తీపి కబురు చెప్పింది.కరోనా మహమ్మారి బ్రిటన్ పై కూడా తీవ్ర ప్రభావం చూపించిన విషయం విధితమే.

అమెరికా అంతగా కాకపోయినా బ్రిటన్ పై కరోనా ప్రభావం తీవ్రంగానే కనిపించింది. బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం ఎక్కువే అయితే కరోనా మహమ్మారిపై ముందు నుంచుని ధైర్యంగా పోరాడుతున్న భారత్ సహా వర్క్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ హెల్త్ కేర్ సిబ్బంది మరియు ప్రొఫెషనల్స్ కి వీసా గడువు మరింతగా పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.

ఈ విషయాన్ని బ్రిటన్ హోమ్ మంత్రి భారత సంతతికి చెందిన ప్రతీ పటేల్ ప్రకటించారు.అక్టోబర్ 1 తోనే వీసా గడువు ముంచుకొస్తున్న సమయంలో డాక్టర్లు, రేడియో గ్రాఫర్లు, సామాజిక కార్యకర్తలు, ఫార్మా రంగ నిపుణులు, వంటి పలు విశిష్టమైన సేవలు కలవారి వీసాలని సుమారు ఏడాది పాటు పొడిగిస్తున్నట్టుగా తెలిపారు.

త్వరలో వీళ్ళందరికి ఉచిత వీసా గడువు పొడిగింపు అమలులోకి రానుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube