ఆంక్షలు ఎత్తివేత: ఓసీఐ, పీఓఐ కార్డుదారులు భారత్ రావొచ్చు, కానీ..!!  

Visa Curbs Eased; OCI Card Holders Can Visit India, Not For Tourism OCI Card Holders, India, PIO Card Holders, Indian Central Governament, Tourist, Medical, Electronic Visa, Overseas Citizens Of India, Airlines - Telugu Airlines, Electronic Visa, India, Indian Central Governament, Medical, Oci Card Holders, Overseas Citizens Of India, Pio Card Holders, Tourist

కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై అన్ని దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.దీని కారణంగా వివిధ దేశాలకు చెందిన వారు ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు.

TeluguStop.com - Visa Curbs Eased Oci Card Holders Can Visit India Not For Tourism

వీరిలో భారతీయులు సైతం వున్నారు.కరోనా ఉద్దృతంగా ఉండటం చేత అత్యవసర సర్వీసులు సైతం సవాలక్ష నిబంధనలు పాటించాల్సి వచ్చేది.

ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో అన్ని దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నాయి.మనదేశం కూడా కొన్ని దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాలను కుదుర్చుకుని చాలా పరిమితంగా రాకపోకలు సాగించేందుకు ఎయిర్ లైన్ సంస్థలకు అనుమతినిచ్చింది.

TeluguStop.com - ఆంక్షలు ఎత్తివేత: ఓసీఐ, పీఓఐ కార్డుదారులు భారత్ రావొచ్చు, కానీ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో భారతదేశానికి రావాలనుకునే ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా), పీఐఓ (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) కార్డుదారులకు, వీదేశీ పౌరులకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.ఓసీఐ, పీఐఓ, విదేశీ పౌరులు ఇండియాకు రావడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రకనట విడుదల చేసింది.

కరోనాకు ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా భారత్‌కు వచ్చేవారో, ఇకపైనా అలాగే రాకపోకలు సాగించొచ్చని పేర్కొంది.అయితే టూరిస్ట్, మెడికల్, ఎలక్ట్రానిక్ వీసాలపై మాత్రం భారత్‌కు రావాడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.

ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది.అంతేకాకుండా విదేశాల నుంచి ఇండియా వచ్చే ప్రయాణికులు కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

కాగా అమెరికా, బ్రిటన్‍, జర్మనీ, ఫ్రాన్స్‌ల నుంచి ఓవర్సీస్‍ సిటిజన్స్ ఆఫ్‍ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు ఇక నుంచి సందర్శన నిమిత్తం భారత్‍కు రావచ్చని ఆగస్టులో హోంశాఖ తెలిపిన సంగతి తెలిసిందే.వైద్యం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఈ దేశాల నుంచి వచ్చే విదేశీయులకు వీసా సదుపాయం కల్పిస్తామని వెల్లడించింది.

భారతీయులు కూడా ఏ రకమైన వీసాల ద్వారా నైనా ఈ దేశాలకు వెళ్లవచ్చని పేర్కొంది.ఈ మేరకు ఆయా దేశాలతో పౌర విమానయాన శాఖ ద్వైపాక్షిక ఎయిర్‍ బబుల్‍ ఒప్పందం చేసుకున్నట్టు హోంశాఖ వర్గాలు తెలిపాయి.

#Electronic Visa #India #IndianCentral #Tourist #Airlines

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Visa Curbs Eased Oci Card Holders Can Visit India Not For Tourism Related Telugu News,Photos/Pics,Images..