మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) టైర్ 2 హీరోల్లో ఒకరు.ఈయన లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
యాక్సిడెంట్ కారణంగా దాదాపు మూడేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు.కానీ లాంగ్ గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఈయనకు బాగానే కలిసి వచ్చింది అనే చెప్పాలి.
సాయి తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ కార్తీక్ దండు ( Karthik Varma Dandu ) తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ (Virupaksha).ఈ సినిమా ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాతో సాయి తేజ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు అనే చెప్పాలి.
మొదటి రోజు కంటే ఆ తర్వాత వీకెండ్ లో పుంజుకుని స్ట్రాంగ్ వసూళ్లను రాబట్టింది.దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.విరూపాక్ష భారీ వసూళ్లను రాబడుతూ ఇప్పుడు ఏకంగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.4 రోజుల్లోనే ఫస్ట్ మైల్ స్టోన్ 50 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరి సాయి తేజ్ సంచలనం సృష్టిస్తున్నాడు.
ఈ సినిమా థియేటర్స్ దగ్గర ఇంకా హైప్ తగ్గలేదు.చూస్తుంటే మరింత వసూళ్లను ( Virupaksha Collections ) రాబట్టే అవకాశం కనిపిస్తుంది.ఇలా టైర్ 2 హీరోల్లో ఒకరైన సాయి తేజ్ 50 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసాడు.మొత్తానికి సాయి తేజ్ హిట్ అందుకోవడమే కాకుండా ఆయన కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి బెస్ట్ కంబ్యాక్ గా కూడా ఈ సినిమా నిలిచింది.
ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.సుకుమార్ ఇచ్చిన కథతో ఈయన అసిస్టెంట్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇక ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.చూడాలి లాంగ్ రన్ ఎప్పటికి పూర్తి అవుతుందో.