ప్రస్తుతం జరుగుతోంది శ్రావణమాసం.మామూలుగా శ్రావణమాసం వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక పెళ్ళిళ్ళతో ఫంక్షన్ హాల్స్ పెళ్లి సందడిలతో కిటకిటలాడేవి.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఈ పరిస్థితి మనకు ఎక్కడా కానరావడం లేదు.పుట్టినరోజు వేడుకలు చిన్న చిన్న కార్యక్రమాలు పెళ్లిసందడి వంటి వేడుకలు శుభకార్యాలు పూర్తిగా కళ తప్పాయి.
బందు జనం మొత్తం రాకుండానే ఇలాంటి సందడులు లేకుండానే పెళ్లిళ్లు తూతూమంత్రంగా జరిగిపోతున్నాయి.దీనికి కారణం కరోనా మహమ్మారి.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం కేవలం పెళ్లికి 50 మంది అతిధులు మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వ ఆంక్షలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో మనం చూస్తూనే ఉన్నాం.
కేవలం వారి ఇంటి పెద్ద మనుషులు మాత్రమే పెళ్లిలో నూతన వధూవరులను ఆశీర్వదించి అవకాశం లభిస్తోంది.బంధువర్గానికి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది.
దీంతో ఇప్పుడు అంతా వర్చువల్ బ్లెస్సింగ్స్ బెటర్ అని చాలా మంది భావిస్తున్నారు.అయితే తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువతి తన వివాహం ఆగస్టు 6న జరగబోతోంది.
అయితే ఇందుకోసం ఆ యువతి వారి మిత్రులకు బంధువర్గానికి సోషల్ మీడియా ద్వారా శుభలేఖలను అందజేసింది.ఇంత వరకు బాగున్న తను చెప్పే పద్ధతి మాత్రం చాలా కొత్తగా అనిపించింది.
అదేమిటంటే ఎవరైనా మా పెళ్ళికి తప్పకుండా రండి అని పిలిచేవారు.కాకపోతే ఇప్పుడు అలా పిలచలేని పరిస్థితి.దీంతో మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని అక్కడి నుంచే మా జంటకు బ్లెస్సింగ్స్ ఇస్తే చాలని కబురు పంపింది ఆ యువతి.మీరు పెళ్లికి వస్తే మా సంతోషం మరింత ఎక్కువ అయ్యేదని, కానీ ఏం చేస్తాం ప్రభుత్వ నిబంధనలను పాటించాలని చెబుతూనే మీరు అక్కడి నుంచే మా జంటని ఆశీర్వదించాలని కోరింది.