ఒక్క స్క్రాచ్ కార్డుతో కోటీశ్వరుడైయ్యాడు.. ఎవరంటే?

కొందరికి అదృష్టం అలా కలిసొస్తుంది.అసలు ఏమి చెయ్యకపోయినా సరే వాళ్లకు దరిద్రం పట్టినట్టు పడుతుంది అదృష్టం.

 Virginia Man Buys Scratch Card, Virginia Man, Wins, 1 Crore, Mother, Scratch Car-TeluguStop.com

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఈ ఘటన గురించి తెలిస్తే మీరు కూడా అదే మాటా అంటారు.ఒకటా రెండా.

ఏకంగా కోటి 50 లక్షల రూపాయిలు సింగిల్ స్క్రాచ్ కార్డుతో సొంతం అయ్యాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తి తన తల్లితో కలిసి సరదాగా సరుకుల షాప్‌కు వెళ్లాడు.తల్లి సరుకులు కొనే పనిలో బాగా బిజీగా ఉంది.

దీంతో ఆ వ్యక్తికి ఏం చెయ్యాలో తోచకా ఆ షాపు అంత తిరిగాడు.అప్పుడు అతడికి ఓ స్కాచ్ కార్డు కనిపించింది.

దీంతో దాన్ని ఒకటి కొని జేబులో వేసుకున్నాడు.

ఈలోపు తల్లి షాపింగ్ పూర్తి చేసుకొని రావడంతో ఏమి తెలియనట్టు అతను ఇంటికి వచ్చేశాడు.

అయితే ఇంటికి వచ్చాక స్క్రాచ్ కార్డు తీసి చూస్తే ఒకటికి కాదు రెండు కాదు ఏకంగా 200,000 డాలర్లు లాటరీ తగిలింది.దీంతో అతను గట్టిగ అరవడంతో తల్లి వచ్చి ఏమైందని అడగగా అతను లాటరీని చూపించాడు.ఇంకేముందు షాక్ తో పడిపోయిన ఆమె కాసేపటికి లేచి ఆనందంతో గంతులు వేశారు.200,000 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో కోటిన్నరపైనే రూపాయలు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube