ప్రమాణ స్వీకారానికి ముందే అలజడి...ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది..!!

మరో రెండు రోజుల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా బిడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అమెరికా క్యాపిటల్ లో జరిగిన అల్లర్ల నేపధ్యంలో ఈ ప్రమాణ స్వీకారానికి ఊహించని స్థాయిలో కట్టుదిట్టమైన బద్రతలు ఏర్పాటు చేశారు అధికారులు.

 Man Arrested Near Capitol With Gun, 500 Rounds Of Ammunition, Capitol, American,-TeluguStop.com

చీమ చిటుక్కుమన్నా రెప్పపాటులో అలెర్ట్ అయ్యేలా అమెరికా భద్రతా దళాలు సిద్దంగా ఉన్నాయి.వాషింగ్టన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో కొద్ది మందికి మాత్రమే ప్రవేశం కలిపించారు.

అయితే వాషింగ్టన్ వెళ్ళే ప్రతీ ఒక్కరిని బలగాలు క్షుణంగా పరీసిలించిన తరువాత మాత్రమే వదులుతున్నారు.ఈ క్రమంలోనే

బలగాలు సోదాలు చేస్తున్న తరుణంలో 500 రౌండ్ల బుల్లెట్లతో పట్టుబడటంతో అలజడి రేగింది.

ఇప్పటికే అమెరికా ఇంటిలిజెన్స్, ఎఫ్బి ఐ ప్రమాణ స్వీకారానికి ముందే అల్లర్లు జరుగుతాయని ప్రకటించిన నేపధ్యంలో ఓ అనుమానితుడు ఏకంగా 500 రౌండ్ల బుల్లెట్లతో దొరకడం వారి అనుమానాలకు మరింత తావిస్తోంది.ఈ ఘటనతో ఒక్క సారిగా ఉలిక్కిపడిన బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి.అతడిని విచారణ చేసిన అధికారులు అతడు అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన వెస్లీ బీల్ గా గుర్తించారు…అంతేకాదు

Telugu Rounds, America, American, Capitol, Joe Biden, Capitol Gun, Virginia-Telu

భద్రతా అధికారులను మాయచేసి మరీ బిడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు యితడు ఏకంగా ఓ నకిలీ పాస్ ను కూడా సృష్టించుకున్నాడు.దాంతో అతడిని పూర్తీ స్థాయిలో విచారణ చేస్తున్న పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.క్యాపిటల్ భవనం వద్ద జరిగిన అల్లార్లు లాంటివే జరిగే ప్రమాదముందని ముందు నుంచి అధికారులు హెచ్చరిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన జరిగడంతో మరింత కట్టుదిట్టమైన బద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube