తెల్లజాతి విద్యార్థులు జుట్టు కత్తిరించారన్న నల్లజాతి బాలిక: వాస్తవమా...కట్టుకథేనా..?

మానవహక్కుల కార్యకర్తలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా… ప్రభుత్వం ఎన్ని కఠినచర్యలు తీసుకుంటున్నా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నల్లజాతివారి పట్ల శ్వేతజాతీయుల వివిక్ష కొనసాగుతూనే ఉంది.ఈ క్రమంలో ఓ 12 ఏళ్ల బాలిక పట్ల ఆమె తోటి తెల్లజాతి విద్యార్థులు అవమానకరంగా ప్రవర్తించారు.

 Virginia Girl Whoclaimed Whiteclassmates Cut Her Dreadlocksadmits-TeluguStop.com

వర్జీనియా రాష్ట్రం స్ప్రింగ్‌ఫీల్డ్‌‌కు చెందిన 12 ఏళ్ల అమెరికన్-ఆఫ్రికన్ అమరి అలెన్ స్థానిక ఇమ్మాన్యుయేల్ క్రిస్టియన్ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతోంది.

Telugu Graderblack, Story, Telugu Nri Ups, Virginia-

  ఈ క్రమంలో ముగ్గురు శ్వేతజాతి విద్యార్థులు ఆమెను పట్టుకుని అమరి జుట్టును కత్తరించారు.జరిగిన సంఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ సందర్భంగా అమరి అలెన్ మీడియాతో మాట్లాడుతూ ఆ ముగ్గురు నా నోటిని మూసివేసి, చేతులు వెనక్కు లాగి తన జుట్టును కత్తిరించి తనను అందవిహీనంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది.

దీనిపై బాధితురాలి నాయనమ్మ మాట్లాడుతూ.ఈ చర్య చంపడంతో సమానమని… తమను ఇది ఎంతగానో బాధించిందని వాపోయారు.

Telugu Graderblack, Story, Telugu Nri Ups, Virginia-

  అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తాము తెల్లజాతి విద్యార్థులపై చేసిన ఆరోపణలు కల్పితమైనవంటూ అమరి కుటుంబసభ్యులు ఒక ప్రకటన విడుదల చేయడం సంచలనం కలిగించింది.అటు ఈ సంఘటనపై స్కూలు యజమాన్యం సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఆ అమ్మాయి చెబుతోంది నిజమా, ఆబద్ధమా అన్నది తేల్చాల్సిందిగా పాఠశాల అధిపతి స్టీఫెన్ ఈ డానిష్.ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ పోలీస్ శాఖకు లేఖ రాశారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube