అతనికి అవకాశం‌ ఇస్తే కరోనా వ్యాక్సిన్‌ కూడా చేస్తాడేమో: వీరేంద్ర సెహ్వాగ్

ప్రస్తుతం యూఏఈ దేశంలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో భాగంగా అనేక మంది యువ ఆటగాళ్లు వారి ఆటతీరును కనబరుస్తున్నారు.అందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆల్ రౌండర్ పాత్ర వహిస్తున్న రాహుల్ తెవాటియాపైటీమిండియా మాజీ డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సేవ ప్రశంసల వర్షం కురిపించాడు.

 Ipl, Ipl 2020, Virat Kohili, Catches, Wicket, Virendra Shewag, Rahul Tevatiya, T-TeluguStop.com

అతనికి ఎవరైనా అవకాశం ఇస్తే కరోనా వ్యాక్సిన్ కూడా కనిపెడతాడు అంటూ తనదైన శైలిలో అతనిని ఆకాశానికి ఎత్తేశాడు.ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టు కి తన సూపర్ బ్యాటింగ్ తో జట్టుకు కొన్ని సంచలన విజయాలని అందించిన రాహుల్ తెవాటియా తాజాగా జరిగిన మ్యాచ్ లో కూడా తన ప్రతాపాన్ని చూపించాడు.

తాజాగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన జట్టులో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గెలిచినా రాహుల్ తెవాటియా పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టాడు.రాహుల్ తెవాటియా తన బ్యాటింగ్ లో కేవలం 11 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా అనంతరం బౌలింగ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్ పడిక్కల్ వికెట్ తీశాడు.

ఈ రెండు ఒక వైపు ఉంటే మరోసారి తన ఫర్ఫార్మెన్స్ ను ఫీలింగ్ లో కూడా చూపించాడు.బౌండరీ లైన్ వద్ద ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని అమాంతం గాల్లోకి ఎగిరి సూపర్ క్యాచ్ ను పట్టాడు.

విరాట్ కోహ్లీ కొట్టిన భారీ షాట్ బంతి కచ్చితంగా సిక్సర్ అని అందరూ భావించిన సమయంలో లైన్ వద్ద సూపర్ ఫీల్డింగ్ చేస్తూ ఆ క్యాచ్ ను పట్టుకొని విరాట్ కోహ్లీ ని పెవిలియన్ కు పంపాడు.అయితే ఈ క్యాచ్ పట్టుకుంటున్న సమయంలో క్యాచ్ చేజారేలా కనిపించినా అతని సమయోచిత ఆలోచనగా ఆ బంతిని చాలా బాగా పట్టుకున్నాడు.ఇకపోతే ఈ క్యాచ్ ను చూసిన వీరేంద్ర సెహ్వాగ్ రాహుల్ తెవాటియాను కొనియాడుతూ తన స్టైల్లో ట్వీట్ సంధించాడు.ఈ ఐపీఎల్ సీజన్ లో తెవాటియా అవకాశం ఇస్తే ఏదైనా చేయగలడని… ఆఖరికి తనకు అవకాశం ఇస్తే కరోనా వ్యాక్సిన్ కూడా తయారు చేయగలడు.

అద్భుతమైన క్యాచ్ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.ఇందులో భాగంగానే తెవాటియా పట్టుకున్న సూపర్ క్యాచ్ కు సంబంధించి ఫోటోను కూడా జతచేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube