ఏదేమైనా విరాటపర్వం అటు వెళ్లదట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న చిత్రం విరాటపర్వం.ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని ఈ సినిమా టీజర్, పాటల వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

 Virataparvam Will Not Release In Ott-TeluguStop.com

ఇక ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవిలు జంటగా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.కాగా ఈ సినిమా నక్సలైట్ నేపథ్యంలో వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే అన్ని పనులు ముగించుకున్న ‘విరాటపర్వం’కు కరోనా పెద్ద అడ్డంకిగా మారింది.అన్నీ బాగున్నట్లు అయితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యేది.కానీ దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో థియేటర్లు మూతపడ్డాయి.దీంతో పలు చిత్రాలతో పాటు విరాటపర్వం చిత్రం కూడా వాయిదా పడింది.

 Virataparvam Will Not Release In Ott-ఏదేమైనా విరాటపర్వం అటు వెళ్లదట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రస్తుతం సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతుండటంతో, ఈ సినిమా కూడా అదే బాటలో రానుందని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే విరాటపర్వం చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లలో చూస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచన తమకు లేదని చిత్ర నిర్మాతలు అంటున్నారు.ఏదేమైనా ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని వారు అంటున్నారు.దీంతో విరాటపర్వం ఓటీటీ రిలీజ్ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో ఇక ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

#Sai Pallavi #Virataparvam #Rana Daggubati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు