నారప్ప బాటలో విరాటపర్వం.. కానీ!

టాలీవుడ్‌ను కరోనా ఎలాంటి దెబ్బ తీసిందో అందరికీ తెలిసిందే.గతేడాది నుండి పలు సంఖ్యలో చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉన్నా, అవి తమ రిలీజ్‌లను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి.

 Virataparvam In Naarappa Route, Naarappa, Virataparvam, Venkatesh, Amazon, Netfl-TeluguStop.com

అటు కొన్ని సినిమాలు థియేటర్లు లేకపోవడంతో నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం.ఇటీవల ఓటీటీలకు విశేష ఆదరణ లభిస్తుండటం, నిర్మాతలకు తాము పెట్టిన డబ్బులకంటే రెట్టింపు వస్తుండటంతో వారు కూడా తమ సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకే ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు.

దీంతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా పలు సినిమాలు ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి.

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది.

తమిళ చిత్రం ‘అసురన్’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఊరించి మరీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది.దీంతో ఈ సినిమాపై మునుపున్న అంచనాలకంటే ఎక్కువ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక వెంకటేష్ లాంటి సీనియర్ హీరో కూడా ఓటీటీ బాట పడుతుండటంతో యంగ్ హీరోలు కూడా తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.ఈ క్రమంలోనే యంగ్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న విరాటపర్వం కూడా ఓటీటీ బాటపట్టేందుకు రెడీ అయ్యిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

నారప్ప చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ అవుతుండటంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది.ఒకవేళ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విజయం సాధిస్తే మరిన్ని తెలుగు సినిమాలు కూడా నేరుగా ఓటీటీ బాట పట్టేందుకు రెడీగా ఉన్నాయి.

ఇందులో ముందు వరుసలో ఉన్న సినిమాగా విరాటపర్వం నిలుచుంది.దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ రొమాంటిక్ సోషల్ డ్రామా చిత్రానికి కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ నుండి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా నిర్మాతలు ఈ ఆఫర్‌ను హోల్డ్‌లో పెట్టారట.నారప్ప చిత్రానికి వచ్చే రిజల్ట్‌ను బట్టి విరాటపర్వం అడుగు ముందుకు వేసేందుకు రెడీ అవుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరి నారప్ప బాటలో విరాటపర్వం పయనిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube