'విరాటపర్వం' స్పెషల్ సాంగ్ ను రానా పాడబోతున్నాడా!

రానా దగ్గుబాటి విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు.తన క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే ఎలాంటి పాత్ర అయినా చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడు.

 Virata Parvam Special Song By Rana-TeluguStop.com

ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ప్రెసెంట్ రానా చేసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి.

ఈ సినిమాలో ముద్దుగుమ్మ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ఎప్పుడో విడుదలకు సిద్దమైన కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

 Virata Parvam Special Song By Rana-విరాటపర్వం’ స్పెషల్ సాంగ్ ను రానా పాడబోతున్నాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా సాయుధ పోరాట నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు బాగానే ఉన్నాయి.

ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ నల్లమల అడవుల్లో జరుగుతుంది.ఇక క్లైమాక్స్ పూర్తి అయితే ఈ సినిమా షూటింగ్ ముగిసినట్టే.

ఇక తాజగా ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట.దానిని దర్శకుడు రానా తో పాడించాలని అనుకుంటున్నాడట.

అందుకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంగీకరించడంతో ఈ పాట రానా తో పాడించ బోతున్నారట.ఈ పాటకు రానా గొంతు సరిగ్గా సరిపోతుందని అందుకే ఆయనతోనే పాడించేందుకు రెడీ అవుతున్నారని టాక్.

ఇక అదే కనుక నిజమైతే రానా గాత్రం మనందరం వినవచ్చు.ఈ సినిమాలో ఈ పాటకు ఎంతో ప్రత్యేకత ఉంటుందట.ఈ సాంగ్ సందర్భానుసారంగా ఉంటుందట.అందుకే ఈ సాంగ్ ను రానా తో పాడిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ అనుకుంటున్నారట.

ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

#Udugula Venu #Rana Turns #Sai Pallavi #Virata Parvam #Suresh Bobbili

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు