విరాటపర్వం సినిమా రిలీజ్ పై సస్పెన్స్...ఓటీటీ వైపు మొగ్గు

రానా దగ్గుబాటి, సాయి పల్లవి కాంబినేషన్ లో వేణు ఊడుగుల తెరకెక్కించిన సినిమా విరాటపర్వం.దశాబ్దాల క్రితం టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన నక్షలిజం బ్యాక్ డ్రాప్ లో నడిచే విప్లవ కథని మళ్ళీ ఈ సినిమా ద్వారా వేణు ఊడుగుల చెప్పబోతున్నాడు.దీంతో సినిమాపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యి ఉంది.ఆ మధ్య రిలీజ్ అయిన మూవీ టీజర్ కూడా అంచనాలు పెంచేసిందని చెప్పాలి.ఇక క్రేజీ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో నక్షలైట్ లీడర్ గా ఉన్న రానాని చూడకుండానే ప్రేమించే గిరిజన యువతి పాత్రలో కనిపిస్తుంది.అతని కోసం అడవిలోకి వెళ్ళిపోయిన ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే విషయాన్ని సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.సాయి పల్లవి పాత్ర పాయింట్ అఫ్ వ్యూ నుంచి ఈ సినిమా కథని దర్శకుడు నేరేట్ చేసినట్లు సమాచారం.90వ దశకంలో తెలంగాణలో నక్షల్స్ పోరాటంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ కథని తెరకెక్కించారు.అన్ని అనుకూలంగా ఉంటే ఈ నెలలోనే విరాటపర్వం రిలీజ్ అయ్యేది.అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ క్లోజ్ కావడంతో రిలీజ్ వాయిదా పడింది.అయితే ఇప్పుడు సినిమాకి ఓటీటీ చానల్స్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది.సౌత్ లో సాయి పల్లవికి మంచి డిమాండ్ ఉండటంతో పాటు రానా కూడా పాన్ ఇండియా స్టార్ కావడంతో సినిమాకి ఫ్యాన్సీ రేట్ చెల్లించేందుకి ఒటీటీ చానల్స్ ముందుకొస్తున్నాయి.

 Virata Parvam Movie Release Planning In Ott-TeluguStop.com

ఈ నేపధ్యంలో సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.ఒటీటీ రిలీజ్ వైపు మొగ్గు చూపిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

 Virata Parvam Movie Release Planning In Ott-విరాటపర్వం సినిమా రిలీజ్ పై సస్పెన్స్… ఓటీటీ వైపు మొగ్గు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Priyamani #VirataParvam #VirataParvam #Rana Daggubati #VirataParvam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు