టాలీవుడ్ భళ్లాలదేవ రానా దగ్గుబాటి ప్రస్తుతం నటిస్తున్న విరాటపర్వం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ట్యాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి పాత్ర సినిమాకు హైలైట్ కానుందట.
ఈ సినిమాలో రానా పాత్రలో కొత్త కోణం ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
పొలిటికల్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని, మంచి కోసం పోరాడే వ్యక్తిగా రానా కనిపిస్తాడని తెలుస్తోంది.
అయితే రానా మంచి వ్యక్తి మాత్రమే కాదని, నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా, తెలంగాణలోని 1980-90 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.నక్సల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి ప్రజా గాయకురాలిగా నటిస్తోంది.
ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.మరి ఈ సినిమాలో రానా కొత్త కోణం ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.