ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డ్  

ఐపీఎల్ అరుదైన చెత్త రికార్డ్ నమోదు చేసిన విరాట్ కోహ్లి. .

Virat Kohli Worst Record In Ipl History-ipl 2019. Rcb,virat Kohli,worst Record In Ipl History

ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుని దురదృష్టం వెంటాడుతూ ఉంది. ప్రతి టీంలో ఏదో ఒక బ్యాట్స్ మెన్, లేదంటే బౌలర్ విరాట్ సేన ఓటమిని శాసిస్తూ ఉన్నారు. శుక్రవారం కోల్ కత్తా తో జరిగిన మ్యాచ్ లో భారీ స్కోర్ చేసిన రస్సెల్ రూపంలో వారి గెలుపుకి అడ్డంకి ఏర్పడింది...

ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డ్-Virat Kohli Worst Record In IPL History

ఇక ఈ ఓటమితో విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లలో ఓడిపోయిన ఆటగాడుగా కోహ్లీ అరుదైన చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ 86 మ్యాచ్‌లలో ఓడిపోయిన జట్టులో సభ్యుడిగా కోహ్లీ ఉండటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆటగాడూ ఇన్ని మ్యాచ్‌లలో ఓడిపోలేదని చెప్పాలి.

అయితే ఇలాంటి చెత్త రికార్డ్ ఉన్న కోహ్లి మరో మంచి రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వ్యక్తిగతంగా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరు మీదకి రావడం విశేషం.