కోహ్లీ ఒంటరి పోరాటం..సెంచరీ కొట్టగానే ఏం చేసాడో తెలుసా.? అనుష్క రియాక్షన్ హైలైట్.!  

Kohli Slams 1st Test Hundred In England, Dedicates It To Anushka Sharma -

ఇంగ్లాండ్ గడ్డపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీని సొంతం చేసుకున్నాడు.టెయిలండర్ల సాయంతో ఒంటిరి పోరాటం చేస్తూ సెంచరీతో ఆకట్టుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

అటు టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల నుంచి సాధారణ క్రికెట్‌ అభిమాని వరకు కోహ్లిని కొనియాడక ఉండలేకపోతున్నారు.సోషల్‌ మీడియా వేదికగా ‘దటీజ్‌ కోహ్లి’ అంటూ తమ అభిమాన క్రికెటర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

కోహ్లీ ఒంటరి పోరాటం..సెంచరీ కొట్టగానే ఏం చేసాడో తెలుసా. అనుష్క రియాక్షన్ హైలైట్.-General-Telugu-Telugu Tollywood Photo Image

ఒంటి చేత్తో ఇంగ్లండ్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకోని శతకం సాధించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని చూసి అతని సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ మురిసిపోయింది.ప్రస్తుతం కోహ్లితో పాటు ఇంగ్లండ్‌లోనే ఉన్న అనుష్క ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టుకు హాజరైంది.ఇక సెంచరీ అనంతరం కోహ్లి ఈ ఇన్నింగ్స్‌ను తన సతీమణికి అంకితం ఇస్తూ.సంబరాలు చేసుకున్నాడు.చైన్‌తో తన మెడలో వేసుకున్న వెడ్డింగ్‌ రింగ్‌కు ముద్దిస్తూ.స్టాండ్స్‌లో ఉన్న అనుష్క వైపుకూ చూస్తూ ఓ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు.

దీనికి అనుష్క ఆనందరతో గంతులేసింది.ప్రస్తుతం ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

తొలి టెస్టు రెండో రోజు తొలి సెషన్‌ ఆరంభంలోనే ఇంగ్లాండ్ జట్టు 287 పరుగులకి ఆలౌటవగా.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కి ఆదిలోనే షాక్ తగిలింది.ఓపెనర్లు మురళీ విజయ్ (20), శిఖర్ ధావన్ (26) కాసేపు మాత్రమే క్రీజులో నిలిచారు.జట్టు స్కోరు 54 వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లి స్వింగ్‌ను, సీమ్‌ను జాగ్రత్తగా గమనిస్తూ పోరాటాన్ని కొనసాగించాడు.

పట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు.కోహ్లీకి ఎవరి నుంచి పెద్దగా సహకారం లభించలేదు.

కేఎల్ రాహుల్ (4), అజింక్య రహానె (15), దినేశ్ కార్తీక్ (0) నిరాశపరచడంతో భారత్ చూస్తుండగానే 100/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.ఈ దశలో హార్దిక్ పాండ్య (22)తో కలిసి కాసేపు స్కోరు బోర్డుని నడిపించిన కోహ్లి.

అనంతరం అశ్విన్‌ (10), ఇషాంత్ శర్మ (5)ల సాయంతో సెంచరీకి చేరువయ్యాడు.కోహ్లి 90లోకి వచ్చినప్పుడు ఇషాంత్ ఔటైనా.

అనంతరం వచ్చిన ఉమేశ్ యాదవ్ (1) చక్కటి సహకారం అందించాడు.

https://twitter.com/SSubhanali2/status/1025240338988814337

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kohli Slams 1st Test Hundred In England, Dedicates It To Anushka Sharma- Related....