హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఆట ప్రదర్శనతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు.తాజాగా న్యూజిలాండ్, టీమ్ ఇండియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే.
అయితే కివీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత ఆటగాళ్లు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ కనబరిచారు.అందుకే ఈ సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయగలిగింది.ముఖ్యంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ భీకర ఫామ్‌లో ఉండి కివీస్ ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు.
టీ20 ప్రపంచకప్ లో కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ నిరాశపరిచినా.ఇప్పుడు మాత్రం ఆయన బ్యాట్ తో రెచ్చిపోయాడు.ఈ నేపథ్యంలో తన ఖాతాలో మరో రికార్డును నెలకొల్పాడు.ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన 3వ మ్యాచ్‌లో అతడు హాఫ్ సెంచరీ సాధించాడు.దీనితో టీ20ల్లో అత్యధికసార్లు 50+ పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ తన పేరును లిఖించుకున్నాడు.
అయితే ఈ హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు రోహిత్ శర్మ.టీమిండియా టీ20 మాజీ సారథి కోహ్లీ గతంలో టీ20ల్లో అత్యధిక సార్లు అర్థ శతకాలు చేసిన ఆటగాడిగా ఓ రికార్డును నెలకొల్పగా ఇప్పుడా రికార్డును బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ.
ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు రోహిత్.
రోహిత్ మొత్తం 30 సార్లు 50+ పరుగులు చేశాడు.విశేషమేంటంటే ఇందులో నాలుగు శతకాలు కూడా ఉన్నాయి.దాంతో ఎక్కువసార్లు అర్థ శతకాలు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచారు.
ఆ తర్వాతి స్థానంలో 29 అర్ధ సెంచరీలతో కోహ్లీ నిలుస్తున్నాడు.ఇక టీ20లో సెంచరీలు బాదిన ఆటగాళ్లలోనూ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు.
నాలుగు సెంచరీలతో అతడు టీ-20 ఇంటర్నేషనల్ లో తొలి స్థానంలో ఉండగా.ఆ తర్వాతి ప్లేసులలో న్యూజిలాండ్, వెస్టిండీస్, టీమ్ఇండియా ఆటగాళ్లు 3, 2, 2 సెంచరీలతో చోటు దక్కించుకున్నారు.
ఇక అర్థ శతకాల్లో కోహ్లీ తర్వాత పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ 25 (ఒక సంచరీ), ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 22 (ఒక సెంచరీ)తో వరుసగా తర్వాతి స్థానాల్లో చోటు చేజిక్కించుకున్నారు.