భూమ్మీద బిజీ క్రికెటర్ గా కింగ్ కోహ్లీ..!

ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో సమకాలిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో విరాట్ కోహ్లీ ముందువరుసలో నిలబడతాడు.అంతర్జాతీయ ఆటగాడికి ఏ మాత్రం తీసుకొని శరీరతత్వం, మైదానంలో ఎంతో యాక్టివ్ గా ఉండి అందరితో సమయోచితంగా వ్యవహరించి మ్యాచ్లను గెలిపించడంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తిగా విరాట్ కోహ్లీ నిలుస్తున్నాడు.

 Virat Kohli, World's Most Busy Cricketer, Indian Cricketer, Busy Cricketer, Int-TeluguStop.com

ఇక లక్ష్యం ఎంత ఉన్నా సరే లక్ష్యఛేదనలో రారాజు తానే అంటూ ప్రత్యర్థులపై ఎలాంటి దయ, కనికరం లేకుండా పరుగులను రాబట్టే వ్యక్తిగా విరాట్ కోహ్లీ పేరు తెచ్చుకున్నాడు.ఆడుతున్నది ఏ దేశం అయినా సరే, వేస్తున్నది ఎవరైనా సరే తాను గ్రౌండ్ లో అడుగు పెడితే అందరూ ఒకటే అన్నట్లుగా రెచ్చిపోయి బ్యాటింగ్ చేసే వ్యక్తిగా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో పేరు పొందాడు.

ఇలా విరాట్ కోహ్లీ గురించి చెప్పుకుంటూపోతే ఎన్నో ఘనతలు ఆయన గురించి చెప్పవచ్చు.ఇకపోతే కింగ్ కోహ్లీ ని తాజాగా వర్ణించేందుకు మరో పేరు వచ్చింది.కేవలం ఒక్కరోజు కాదు నెలలు కాదు సంవత్సరాల తరబడి తన పద్ధతులనుఒక్కొక్కటిగా మార్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం భూమి మీద క్రికెట్ ఆడే ఆటగాళ్ల లో అత్యంత బిజీ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు.2010 నుంచి 2019 మధ్య కాలంలో భూమి మీద అత్యంత బిజీ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ అవతరించాడు.

Telugu Busy Cricketer, Busy Person, Crickter, Earth, Indian Crickter, Kohili, Vi

2008లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో ఆరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లీ మొదటి రెండు సంవత్సరాల్లో కేవలం 15 వన్డేలు ఆడిన ఆ తర్వాత ఆడిన తొమ్మిది సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ క్రికెటర్ ఆడని క్రికెట్ ఆడేశాడు.2010 నుంచి 2019 మధ్య దశాబ్ద కాలంలో ఏకంగా 668 రోజులు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు విరాట్ కోహ్లీ.ఇందులో ఏకంగా 227 వన్డే, 336 టెస్టు, 75 టి20 మ్యాచ్లకు ఆడిన రోజులుగా ఉన్నాయి.ఈ దశాబ్దకాలంలో విరాట్ కోహ్లీ అత్యధికంగా క్రికెట్ రోజులు ఆడిన వ్యక్తిగా పేరు తెచ్చుకోగా విరాట్ కోహ్లీ తర్వాత శ్రీలంక నుంచి ఎంజలో మ్యాత్యుస్ రెండో స్థానంలో ఉండగా ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక్కడ ఇంకో చూడాల్సిన విషయమేమిటంటే అన్ని ఫార్మాట్లలో కలిపి కూడా అత్యధికంగా బంతులు ఆడిన క్రికెటర్ గా కూడా విరాట్ కోహ్లీ రికార్డు కెక్కాడు.విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 26,185 బంతులను ఎదుర్కొన్నాడు.

ఈ వరుసలో విరాట్ కోహ్లీ తర్వాత హసీమ్ ఆమ్లా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube