అనుష్క వ్యవహారం పై మండిపడ్డ కోహ్లి

విరాట్ కొహ్లి కోపం గురించి మనకు తెలియనిదా ! మైదనంలో ఎంత చురుగ్గా ఉంటాడో అంతే ఆవేశంగా ఉంటాడు.ఒకరి మాట పడడు.

 Virat Kohli Lashes Out A Reporter-TeluguStop.com

పొరపాటున స్లెడ్జింగ్ చేసారో .ఇక అంతే సంగతులు.చివరికి ఆస్ట్రేలియా వాళ్ళతో కూడా ఆటతోనే కాకుండా మాటలతో కూడా ఆడుకున్నాడు.మరి అంత షార్ట్ టెంపర్ ఉన్నోడిని ఒక రిపోర్టర్ కెలికితే .

ఒక పెద్ద గడియారల కంపెని కొహ్లీని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది.ఆ విషయాన్నీ ప్రకటించడానికి చిన్న సమావేశం ఏర్పాటు చేసారు.

అక్కడ ఒక రిపోర్టర్ “ఇంత ఖరీదైన వాచ్ ఎవరికైనా బహుకరించాలి అంటే ఎవరికి ఇస్తారు?” అని అడిగాడు.

దానికి ఆవేశంతో ఊగిపోయిన విరాట్ ” నా కుటుంబసభ్యులలో ఎవరికైనా ఇస్తానేమో, భారతజట్టు సభ్యులలో ఎవరికైనా ఇస్తానేమో.

ఈ ప్రశ్న దేనికోసం అడిగినట్టు? ఈ సమావేశానికి ఈ ప్రశ్నకి సంబంధం ఏంటి ? ఇక్కడికి మనమంతా దేనికోసం వచ్చామో దాని గురించే అడగండి.ఇంకెక్కడికో లాగొద్దు” అంటూ ఘాటుగా బదులిచ్చాడు.

ఆ రిపోర్టర్‌ దొడ్డిదారిలో అనుష్క గురించి అడిగాడని ప్రత్యేకంగా చెప్పాలా! అసలే అనుష్కతో విడిపోయిన తరువాత మనోడి మానసిక స్థితి బాగాలేదు .పైగా తన బ్రేకప్ మీద మీడియా చేసిన హంగామా విరాట్ కి అస్సలు నచ్చలేదు.దాంతో ఇలా బదులు తీర్చుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube