టెస్ట్ లో నెంబర్ వన్ లో కొనసాగుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ కోహ్లి

విరాట్ కోహ్లి కెప్టెన్ గా బాద్యతలు తీసుకున్న తర్వాత టెస్ట్ లలో టీమ్ ఇండియా ఓ విధంగా దూసుకుపోతుందని చెప్పాలి.వరుస సీరిస్ లతో గెలుస్తూ మంచి జోష్ మీద ఉంది.

 Virat Kohli Icc Test Rankings Indiankricket-TeluguStop.com

ధోని శైలికి పూర్తి భిన్నంగా కాస్తా అగ్రిసివ్ గా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు టీమ్ ని తాను ముందుండి నడిపిస్తున్నాడు.అద్బుతమైన ఫాంతో దూసుకుపోతున్న కోహ్లి మరో సారి టెస్ట్ మ్యాచ్ లలో తన నెంబర్ వన్ ర్యాంక్ ని కాపాడుకున్నాడు.

అతని తర్వాత రెండో స్థానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్మిత్ ఉన్నాడు.అయితే వీరిద్దరికీ కేవలం 17 పాయింట్స్ మాత్రమే తేడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే టెస్ట్ ర్యాంకింగ్ లో ప్రకటన తర్వాత తాజాగా ఒకప్పటి స్టార్ టెస్ట్ బ్యాట్స్ మెన్ విండీస్ ఆటగాడు బ్రియాన్ లారా విరాట్ కోహ్లీ మీద ప్రశంసలు కురిపించాడు.విరాట్ కోహ్లీ క్రికెట్ వెర్షన్ లో ఉండే వరల్డ్ టాప్ ఫుట్ బాల్ ప్లేర్యర్ రోనాల్డో అని అభివర్ణించాడు.

ఇక టెస్ట్ ర్యాంకింగ్ లలో భారత టెస్టు ప్లేయర్లు పుజారా, రహానె నాలుగు, ఆరు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.బౌలింగ్ విభాగంగా స్పీడ్‌స్టర్ జస్ప్రిత్ బుమ్రా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక టెస్ట్ ఆల్‌ రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా రెండు, అశ్విన్ ఆరులో నిలిచారు.ఇదిలా ఉంటే తాజాగా టీ20 సీరిస్ ని వెస్ట్ ఇండీస్ మీద గెలిచి ఊపు మీద కనిమించిన కోహ్లి సేన మొదటి వన్డేలో ఓటమిపాలైంది.

ఇక విశాఖ వేదికంగా రెండో వన్డేకి సిద్ధం అవుతుంది.ఈ వన్డే సీరిస్ తర్వాత వెస్ట్ ఇండీస్ తో టెస్ట్ సీరిస్ కూడా ఉంది.ఈ సీరిస్ లో విరాట్ కోహ్లి రాణించకపోతే తన నెంబర్ వన్ ర్యాంక్ ని కోల్పోయే ప్రమాదం ఉంది.ఏది ఏమైనా ప్రస్తుతం టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ లలో తన ప్రతాపం చూపిస్తూ అన్ని దేశాలని మించిపోయి బెస్ట్ టీమ్ గా ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube