మరో ఘనతను తన ఖాతాలో చేర్చుకున్న విరాట్ కోహ్లీ..!

ఐపిఎల్ లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అద్భుత రికార్డును నెలకొల్పాడు.ఇప్పటి వరకూ ఐపిఎల్ లో ఒకే ఫ్రాంచైజీకి 200 మ్యాచ్ లలో కెప్టెన్ గా నాయకత్వం వహించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు.

 Virat Kohli Has Added Another Feat To His Account-TeluguStop.com

అంతేకాదు మరో రికార్డును కూడా కోహ్లీ సాధించాడు.ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 10,000 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.టీ20లో 10 వేల పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర లిఖించాడు.టీ20 ఫార్మాట్లో 10 వేల పరుగుల మార్క్ ను అందుకున్న తొలి భారత క్రికెటర్‌ గా కోహ్లీ చరిత్ర నెలకొల్పడంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.దుబాయ్‌ లో జరిగిన ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ కు ముందుగా చూస్తే 10 వేల టీ20 పరుగులను చేయడానికి విరాట్ కోహ్లీ కేవలం 13 పరుగులే చేయాల్సి ఉంది.

మ్యాచ్‌ లో తన ఆటతీరుతో కోహ్లీ మరింత దూకుడుగా ఆడాడు.

 Virat Kohli Has Added Another Feat To His Account-మరో ఘనతను తన ఖాతాలో చేర్చుకున్న విరాట్ కోహ్లీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీమిండియా తరపున టీ20 క్రికెట్‌ ఫార్మేట్లలో 10 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు.మొత్తంగా చూస్తే ఈ ఘనత సాధించిన 5వ ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు.

వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ 14,261 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు.

Telugu Cricket World, Latest News, New Record, News Viral, Sports Update, T20, Viral Latest, Virat Kohli-Latest News - Telugu

క్రిస్ గేల్ 446 మ్యాచ్‌ లలో 136.94 స్ట్రైక్ రేట్‌ తో 22 సెంచరీలు, 87 అర్థ సెంచరీలు చేసి ముందు వరుసలో ఉన్నాడు.ఐపీఎల్ 2021 ఫార్మాట్ 2కు ముందుగా చూస్తే కోహ్లీ 311 మ్యాచ్‌ లు ఆడాడు.

ఆ తర్వాత 5 సెంచరీలు, 72 అర్ధ సెంచరీలు చేశాడు.దీంతో 9929 రన్స్ చేసి రికార్డు క్రియేట్ నెలకొల్పాడు.2007వ సంవత్సరంలో టీ20 క్రికెట్ కు కోహ్లీ మొదటి అడుగు వేశాడు.133.95 స్ట్రైక్ రేట్‌తో రన్స్ సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.

#Virat Kohli #Cricket World

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు