ఐపీఎల్ కోహ్లీకి 12లక్షల జరిమానా... కారణం అదే

ఐపీఎల్ సీజన్ ప్రస్తుతం ప్రేక్షకులకి కావాల్సినంత వినోదం అందిస్తుంది.చాలా మంది అంచనాలకి మించి రాణిస్తూ ఉంటే, భారీ అంచనాలు పెట్టుకున్న టీంలు, ఆటగాళ్ళు మాత్రం ఆరంభంలో ఇబ్బంది పడుతున్నారు.

 Virat Kohli Fined Rs 12 Lakh For Maintaining Slow Over Rate-TeluguStop.com

టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని బ్యాటింగ్ లో ఒకప్పటి ఫామ్ కొనసాగించలేక ఫెయిల్ అయితే, ప్రస్తుతం టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం మునుపటి ఫామ్ చూపించలేక పోతున్నాడు.దీంతో ఇద్దరి ఆటగాళ్ళ మీద ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.

కరోనా లాక్ డౌన్ టైంలో వీళ్ళు ఆటని పూర్తిగా పక్కన పెట్టేశారు అంటూ మాజీలు విమర్శలు చేస్తున్నారు.అయితే ధోని కెప్టెన్ గా సక్సెస్ అవుతూ ఉన్న విరాట్ కోహ్లి కెప్టెన్ గా కూడా తాజాగా జరిగిన మ్యాచ్ లో విఫలం అయ్యారు.

 Virat Kohli Fined Rs 12 Lakh For Maintaining Slow Over Rate-ఐపీఎల్ కోహ్లీకి 12లక్షల జరిమానా… కారణం అదే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది.కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కు కారణమయ్యాడనే కారణంతో కోహ్లీకి 12 లక్షల జరిమానా విధించారు.

ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ 97 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది.మిగిలిన ఆటగాళ్ళతో పాటు కోహ్లీ బ్యాటింగ్ లో పూర్తిగా విఫలం కావడం, ప్రత్యర్ధి ఆటగాళ్ళు భారీగా పరుగులు రాబట్టడం జరిగింది.

ఈ మ్యాచ్ లో కోహ్లి పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్ లని జారవిడిచి అతను సెంచరీ చేయడంతో పాటు పంజాబ్ భారీ స్కోర్ చేయడానికి కారణం అయ్యాడు.దీంతో పాటు మినిమమ్ ఓవర్ రేటుకు సంబంధించిన ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం జట్టు సారధి అయిన కోహ్లీకి 12 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

#Punjab Kings #Virat Kohli #IPL Management #Indian Cricket #BangaloreRoyal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు